''అఖిల భారత ఇమామ్ సంస్థ'' ముఖ్యులు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది.
ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు.
తాకస్థాయికి చేరిన గ్రీస్ రుణ సంక్షోభంతో ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల అనంతరం వివిధ దేశాలకు చెందిన పెట్టుబడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితులతో అప్రమత్తమైన ఫ్రాన్స్ తన కరెన్సీ మారకం విలువను తగ్గించి నష్టనివారణ చర్యలు తీసుకోవటంతో ఐరోపా కూటమి దేశాలు అదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే తలెత్తిన ఈ ముప్పును గుర్తించటంలో విఫలమైన యూరోజోన్ దేశాలకూటమి ఇప్పుడు గుర్తించి గ్రీస్‌పై ఎదురుదాడికి దిగింది. అత్యవసర సాయాన్ని కొనసాగించకూడదని నిర్ణయించిన ఐరోపా సెంట్రల్ బ్యాంక్ గ్రీస్ బ్యాంకులకు అత్యవసర నగదు సరఫరాను నిలిపివేసింది.
ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్‌లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది.
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలం తక్కువగా ఉన్నప్పటికీ అధికారం, డబ్బు వినియోగించి ఎన్నికల్లో గెలవాలని టిడిపి యత్నిస్తోందన్నారు.
కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు.
పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
కాదేదీ విద్వేషానికి అనర్హం అని గట్టిగా భావించే బిజెపి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సైతం దీనికి వాడుకోవాలని చూడడం జుగుప్సాకరం. యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎందుకు పాల్గొన లేదో సమాధానమివ్వాలని బిజెపికి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆరెస్సెస్ ప్రచారక్ రామ్ మాధవ్ ట్విట్టర్‌లో ప్రశ్నించడం, ఆయన లేకితనాన్ని బయటపెట్టింది. ఆయన ట్వీట్‌కు మద్దతుగా సంఫ్‌ు పరివార్ సైబర్ యోధులూ విజృంభించడంతో ఆ వార్త క్షణాల్లో దేశమంతటికీ పాకింది. ఇది నిజమే కాబోలు అని అనుకునేలా ఈ గోబెల్స్ ప్రచారం సాగింది.