గ్రీస్ సంక్షోభం

తాకస్థాయికి చేరిన గ్రీస్‌ రుణ సంక్షోభంతో ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల అనంతరం వివిధ దేశాలకు చెందిన పెట్టుబడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితులతో అప్రమత్తమైన ఫ్రాన్స్‌ తన కరెన్సీ మారకం విలువను తగ్గించి నష్టనివారణ చర్యలు తీసుకోవటంతో ఐరోపా కూటమి దేశాలు అదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే తలెత్తిన ఈ ముప్పును గుర్తించటంలో విఫలమైన యూరోజోన్‌ దేశాలకూటమి ఇప్పుడు గుర్తించి గ్రీస్‌పై ఎదురుదాడికి దిగింది. అత్యవసర సాయాన్ని కొనసాగించకూడదని నిర్ణయించిన ఐరోపా సెంట్రల్‌ బ్యాంక్‌ గ్రీస్‌ బ్యాంకులకు అత్యవసర నగదు సరఫరాను నిలిపివేసింది. దీనితో వారం రోజుల పాటు దేశంలో బ్యాంకులను మూసివేస్తున్నట్లు గ్రీస్‌ సర్కారు ప్రకటించింది. దేశంలో ద్రవ్యచెలామణి తగ్గటంతో ఆర్థికవ ్యవస్థను పరిరక్షించేందుకు వీలు గా బ్యాంకు ఖాతాలనుండి నగదు ఉపసం హరణ పరిమితిని రోజుకు 60 యూరోలకు పరిమి తం చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వివరిం చింది. 
సంక్షోభం పూర్వాపరాలు
2008 నాటి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ఐరోపా సెంట్రల్‌ బ్యాంక్‌ (ఇసిబి), ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబి)ల నుండి ఉద్దీపనల రూపంలో గ్రీస్‌ 160 కోట్ల యూరోల సాయాన్ని రుణంగా అందుకున్న విషయం తెలిసిందే. ఈ రుణాన్ని తిరిగి చెల్లించే గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగుస్తోంది. ఈ రుణాన్ని తీర్చేందుకు తమకు తాజాగా మరికొంత ఆర్థిక సాయం చేయాలని గ్రీస్‌ కోరటంతో అందుకు సుముఖత వ్యక్తంచేసిన ఆర్థిక సంస్థలు కొన్ని షరతులను విధించాయి. ప్రభుత్వం ఉధృత స్థాయి లో వ్యయకర్తన చర్యలను పాటించాలని, ప్రజలపై పన్నుల భారాన్ని పెంచాలని, ప్రభుత్వ సేవలకు వినిమయ ఛార్జీలను వసూలు చేయాలని పలు షరతులు విధించాయి. అయితే ఇందుకు సుము ఖంగా లేని గ్రీస్‌ ప్రభుత్వం దీనిపై ప్రజాబి óప్రాయం ప్రకారం నడుచుకుంటామంటూ ఇందుకు జులై 5న రిఫరెండం ను నిర్వహించ నున్నట్లు ప్రకటించింది. దీనిపై మండిపడిన ఆర్థిక సంస్థలు గ్రీస్‌కు అత్యవసర నగదు సరఫరాను నిలిపి వేస్తు న్నట్లు ప్రకటించాయి. 
కుదేలయిన మార్కెట్లు
గ్రీస్‌లో తలెత్తిన ఆర్థికసంక్షోభంతో ఐరోపాలోని ఆర్ధిక మార్కెట్లు తీవ్రంగా ప్రతిస్పందించాయి. లండన్‌, పారిస్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌ తదితర నగరాల్లోని స్టాగక్‌ మార్కెట్లలో సోమవారం ఉదయం ప్రారంభమైన ట్రేడింగ్‌ నష్టాలతో కొనసాగింది. ఆసియా స్టాక్‌ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగటం విశేషం. ఈ సంక్షోభం దెబ్బకు అమెరికా డాలర్‌పై యూరో విలువ 2 శాతం మేర పడిపోయింది. దీనితో యూరోజోన్‌లోని ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలు తీసుకున్న రుణభారం పెరిగిపోనున్నది. గడువులోగా రుణాన్ని తీర్చకపోతే గ్రీస్‌ యూరో జోన్‌ నుండి తప్పుకోవాల్సిన ముప్పు కూడా పొంచివుండటం విశేషం.