District News

రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే  రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

        ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తానని, ఈ ఒప్పందాలన్నీ అనైతకమని చెప్పి గిరిజనుల ఓట్లు తో గెలిచారు. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ గిరజనులను...

ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి 47వ వార్డు పరిధి గుల్లలపాలెం జివిఎంసి ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్ని నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారని, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల్లో రెండు డిస్పెన్షరీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పేరుకే 30 పడకల ఆసుపత్రులైనప్పటికీ, కొన్ని వ్యాధులకే మందులుంటున్నాయని పేర్కొన్నారు. సుగర్‌ టెస్టులు చేయాలంటే ట్యూబులు లేవని, రక్తహీనతకు, కీళ్ళ నొప్పులు తదితర వ్యాధులకు మందులు ఉండడం లేదని తెలిపారు. 

ఆ గ్రామాలు కాలుష్యానికి చిరునామాలు....! రోగాలకు నిలయాలు.....!! నీటి యుద్ధాలకు నిలువుటద్దాలు....!!! అవి ఎక్కడా అనుకుంటున్నారా! అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల కెక్కిన విశాఖ సమీపంలోని సింహాద్రి ఎన్‌టిపిసి విద్యుత్‌ కర్మాగార చుట్టుప్రక్కల గ్రామాలు. వివిధ పరిశ్రమల విషవాయువుల వల్ల కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న గ్రామాలు, వాటి వల్ల బలౌతున్న ప్రాణుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తీర ప్రాంతంలో సెజ్‌లు, పిసిపిఐఆర్‌లు, విద్యుత్‌ ప్లాంట్లతో ముంచెత్తనున్నట్లు ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల అక్కడ పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల జీవితాలు ఏవిధంగా ఛిద్రమయ్యాయి? వారిని ఏవిధంగా కాపాడాలనే కనీసం ఆలోచనలేని ఈ...

గిరిజన హక్కుల రక్షణకు , బాక్సైటు తవ్వకాలను జరపనివ్వ బోమని .. అటవీ హక్కుల రక్షణకు .. ఆదివాసిలకు మెరుగైన సదుపాయాల కల్పనే .. కా. యెమ్. సూర్యనారాయణకు ఇచ్చే నిజ నివాళి.. సూర్య ప్రధమ వర్దంతి సభలో సి. ఐ. టి. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కా. . సి హెచ్. నరసింగ రావు అన్నారు. సూర్య కార్మిక , కర్షక ఉద్యమ స్పూర్తి అని కా. లోకనాధం నివాళి అర్పించారు.  లోకనాధం గారు మాటలాడుతూ  కామ్రేడ్ సూర్యం ప్రజలను ఇష్టపడ్డాడు .. ఈ సమాజం ఇంతకన్నా బాగుపడాలనుకున్నాడు, సమతా సిద్దాంతాన్ని ఇష్టంగా నమ్మాడు. ఉద్యమాన్ని తన చిరునామా చేసుకున్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమ పిడుగై గర్జించాడు. మైదాన మండలంలో పుట్టిన సూర్యం.. అల్లూరి స్పూర్తిని అందుకున్నాడు. గిరిజనుల పక్షాన...

ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

విశాఖ జిల్లా పాయకరావుపేటలోని ఎస్సీ హాస్టల్లో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, నక్కపల్లి డివిజన్ కార్యదర్శి యం. అప్పలరాజు, దాసు రాత్రి బస చేసారు. విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం సిపియం పార్టీ రాష్ట్రంలో ప్రచారోద్యం చేపట్టింది. అందులో బాగంగా  ప్రభుత్వ వసతి గృహంను పరిశీలించి అక్కడ విద్యార్దులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు .. అనంతరం బిసి వసతి గ్రుహంకు వెళ్లి శ్రమదానం చేసారు.... ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా రంగంపై వున్నా మక్కువ ప్రభుత్వ విద్యా సంస్థలపై లేదు. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పునుకుంటుంది. జిల్లలో 12 వసతి గృహాలను పలు కారణాలతో మూసివేసింది . తక్షణం వాటిని తెరవాలని కె.లోకనాధం...

సమస్యల నిలయంగా అనకాపల్లి ఆసుపత్రి..
సరిపడిన స్టాప్ లేకపోవడంతో అవస్ధలు పడుతున్న రోగులు..
కొన్ని రోగాలకు దోరకని మందులు..
ప్రజారోగ్యవ్యవస్ధను నీరుకారుస్తున్నరని ప్రభుత్వం పై మండిపాటు..
ఆరోగ్యవ్యవస్ధ పరిరక్షణాకే ఉధ్యమిస్తాం..

ప్రచారోద్యమంలో భాగంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సర్వేలో పాల్గోన్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం , అనకపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. బాలకృష్ణ...

జిల్లా కార్యదర్శి మాటలాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీలు , వివిధ కేటగిరీలకు చెందిన 520 పోస్టులు ఏళ్ళ తరబడి భర్తీ కావడంలేదు. సబ్ సెంటర్లు...

 

హైదరాబాద్:విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 102 టన్నుల ఉల్లిగడ్డలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉల్లిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

సింగపూర్‌ కంపెనీల నైట్‌సఫారీలకోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం విశాఖనగరంలో ఉన్న 625 ఎకరాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జూ పార్కును ఎదురుగా ఉన్న కంబాల కొండలోపెడతామని అంటున్నారు. ఇంతవిశాలమైన స్థలాన్ని వదిలి చిన్న స్థలంలో పెడతామని చెప్పడం సరైనదికాదు. ఈ రోజు సిపిఐ(యం)పార్టీ జూపార్కును తరలించొద్దని జూ వద్ద ధర్నా నిర్వహిస్తే జూ సందర్శానికి వచ్చిన పర్యాటకులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రష్యానుండి వచ్చిన వారుసైతం దీన్ని వ్యతిరేకించినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం దున్నపోతుమీద వర్షం కురిసిన చందంగా వ్యవహిస్తోంది. జూ తరలింపు ఒక్క కమ్యూనిస్టు పార్టీలే కాదు పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ జూ పార్కు...

Pages