District News

పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ పోరాటంలో అరెస్టయిన సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, నాయకులు అప్పలరాజు విడుదలైన సందర్భంగా సుజాతనగర్‌లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ను తమతో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఎక్కడో పద్మనాభపురం, ముదపాక శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిస్తే ఏలా ఉంటారని ప్రశ్నించారు. నివాసమున్నచోటే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో ఏ...

బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖ నగరం మద్దిలపాలెం కూడలిలో రాస్తా రోకో నిర్వహిస్తున్న cpi,cpm పార్టీలు.

విజయవాడలో సెప్టెంబర్‌ 15న నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో బస్సు యాత్ర చేపట్టారు. ముందుగా బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూ‌రో స‌భ్యు‌లు బి.రాఘవులు మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి విధానాలు రాష్ట్రంలో ఒకే విధంగా ఉన్నాయన్నారు. టిడిపి, వైసిపిలు ఇంతవరకూ చాలా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాయి కాని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోయాయని, ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోయాయని దుయ్యబట్టారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్‌ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామన్న...

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను దక్కించుకున్న ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కి కాకుండా ప్రైవేట్ సంస్థ అయిన జి.ఎం.ఆర్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ నగరంలో వున్న తాజ్ హోటల్ (గేట్ వే) లో భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్రీ అప్లికేషన్ కాన్పెరెన్స్ ను రద్దు చేయాలని, నిర్మాణ పనులు ఎఎఐ కి అప్పగించాలని ఆందోళన చేస్తున్న సిపిఎం కార్యకర్తలను, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. 

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌-సేవ్‌ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల  ఆరోగ్యాలను రక్షించాలని, పి.హెచ్.సిలలో రోగులకు భోజనం పెట్టాలని, సిపియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శులు లోకనాధం, గంగరావు  విశాఖ పూర్ణమార్కెట్ వద్ద క్యాంపెయిన్ చేసి వ్యాపారుల వద్ద నుండి  బియ్యం, పప్పులు వగైరా సేకరించారు.

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు 

విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

Pages