District News

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి కొరతకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. పుష్కర లింకు, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం విశాఖ నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంచినీటి సరఫరా సమయం తగ్గించారని, కొండ ప్రాంతాలకు నీరు ఎక్కడం లేదని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,...

       విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు, ప్రజలు గురువారం ఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీనికిముందు ద్వారకానగర్‌ కూడలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తూ వినియోగదారులపై ఛార్జీల మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతంలోని బిఎన్‌ఆర్‌ నగర్‌లో 400 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేదన్నారు. చాలాసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా చేయాలని...

                 భీమిలి మండలంలోని దివీస్‌ లేబొరేటరీస్‌ స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి బాధిత భూ సాగుదారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావులు గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వివరాలు....
దివీస్‌ లేబొరేటరీస్‌ భూ సమస్య, కాలుష్యం, ఇతర సమస్యలపై ఫిబ్రవరి 22న మీకు విన్నవించాం. నాలుగు పంచాయతీల్లోని 17 గ్రామాలకు చెందిన 16 వేల మంది ప్రజల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు....

కేంద్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన విద్యాహక్కు చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా విద్యా హక్కుచట్టానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. స్టూడెంట్‌, టీచర్‌ నిష్పత్తి ప్రకారం స్కూల్‌లను మూసివేస్తున్నారని, ఇప్పటికే 400 స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. అభివృద్ధి చెందాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తెరవాల్సినవసరం ఉందన్నారు. సర్వశిక్షా అభియాన్‌ కింద బడ్జెట్‌లో కేటాయింపులు కుదించిందనీ, ఈ మేరకు ఈ పథకం కింద బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు....

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు
తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎమ్‌డి ఛాంబర్‌ లోపలకు చొచ్చుకెళ్లి ఎమ్‌డి సత్యప్రసాద్‌ ఎదుట బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమితి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సమితి కన్వీనర్‌ ఎ.బాలకృష్ణ, కో-కన్వీనర్‌ ఫణిరాజ్‌, ఆప్‌...

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్‌ యాజమాన్యం చర్చలు ద్వారా డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సంధానకర్తలు,...

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను కాలుష్యంతో నింపడమేనా చంద్రబాబు అభివృద్ధి అని ప్రశ్నించారు. వాతావరణానికి హాని లేని, ఉపాధికి కొదువ లేని...

Pages