- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి వున్నది. దళితులు, దళితుల కాలనీలు ఇప్పటికీ అభివ్రద్ధికి ఆమడ దూరంలో వున్నాయి. వివక్షత రూపం మారింది కాని వివక్షతపోలేదు. ఉద్యోగాలు దొరకక యువత అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం నిధులు కేటాయించి అభివ్రద్ధి చేయాలని, దళిత యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని, కులవివక్షత అరికట్టాలని డిమాండ్ చేశారు. కనీసం రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ నియామకం చేయకుండా రాష్ర్ట ప్రభుత్వం తాత్సారం చేయడం దుర్మార్గం. ఈ ప్రెస్ మీట్లో సిపియం విశాఖ జిల్లా, నగర కార్యదర్శులు కె.లోకనాధం, బి.గంగారావు గార్లు పాల్గొన్నారు.