విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర
కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తొలుగుదేశం - బిజెపి కుమ్మక్కు
విమ్స్‌ నిర్వీర్యానికీ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగింత
    
    విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికెల్‌ సైన్స్‌ (విమ్స్‌) హాస్పటల్‌ అవుట్‌ పేషెంట్‌ (ఒ.పి) సేవలను ఏప్రిల్‌ 11న ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమ్స్‌లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఓపి సేవాలు  ప్రారంభించడం వెనుక తెలుగుదేశం, బిజెపిలు పెద్ద కుట్రకు పల్పపాడ్డాయి. ఈ చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖ నగర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
    విమ్స్‌ ఆధీనంలో 100 ఎకరాల స్థలం ఉంది. అందులో 50 ఎకరాలకు పైగా ‘‘ ఎడ్యుకేషన్‌ హబ్‌’’ పేర అధికార పార్టీలో పలుకుబడి కలిగిన ఒక వ్యక్తికి కారు చౌకగా కట్టబెట్టటానికి సిద్ధమైంది. ఇప్పటికే అన్ని రకాల  ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకే దీని మీద తెలుగుదేశం, బిజెపి ప్రజా ప్రతినిధు నోరు మెదపడం లేదు.
    విశాఖలోని కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలు  కుమ్మక్కయ్యాయి. అందుకే విమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించడం లేదు. శాశ్విత వైద్యులు , నర్సులు , ఇతర సిబ్బందిని నియమించడం లేదు. ప్రస్తుతం 14రకాల  సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవాలు  ప్రారంభించడానికి అన్ని నిర్మాణాలు  పూర్తయ్యి ఉన్నాయి. వీటినన్నింటిని వినియోగంలోకి తీసుకొస్తే ప్రైవేట్‌ కార్పొరేట్‌ హాస్పటల్స్‌ వ్యాపార దోపిడికి పెద్ద దెబ్బ తగులుతుందని విమ్స్‌ని పూర్తిస్థాయిలో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం ` బిజెపి అధినేతలు  కార్పొరేట్‌ హాస్పటల్స్‌ అధినేతలతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తున్నది.
    విమ్స్‌కి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు  కేటాయించకుండా ఎన్‌.టి.ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి విమ్స్‌ని బదలాయించడం వెనుక కార్పొరేట్‌ హాస్పటల్స్‌ అధినేత వత్తిడే. ఈ చర్యవల్ల విమ్స్‌ నిర్వీర్యం అవుతుంది. కోటి మంది ప్రజల  ఆరోగ్య ప్రయోజనాల కన్నా కార్పొరేట్‌ హాస్పటల్స్‌ ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా భావించడం అన్యాయం.
    విమ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల  చేయాలి. విమ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు స్పష్టంగా ప్రకటించాలి. మేము లేవనెత్తిన విషయాపై ప్రభుత్వ వైఖరి ప్రజల కు తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 300 కోట్లు విడుదల  చేయాలి. పూర్తి స్థాయిలో వైద్య సేవాలు  ప్రారంభించాలి. శాశ్విత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.