District News

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు. వీరికి సుమారు 2 కోట్ల 26 లక్షల 98 వేలు పంపిణీ చేస్తామని NREGS, కాఫీ బోర్డ్ అధికారులు ప్రకటించారన్నారు . కానీ నేటికి సిల్వర్ ఒక్...

 విధ్వంసకర అభివృద్ధికి తాము వ్యతిరేకమని మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహా సభలో వక్తలు స్పష్టంచేశారు. నగరంలోని సిరిపురం కూడలిలోని బిల్డర్సు అసోసియేషన్‌ సభా వేదికలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఎం.శరత్‌ అధ్య్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ పదేళ్లుగా తమ సంఘం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను, పరిశ్రమలను వ్యతిరేకిస్తామని తమ మీద నింద ఉందని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, విధ్వంసకర అభివృద్ధిని మాత్రమే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పిసిపిఐఆర్‌ పేరుతో ఏర్పరచబోయే కోస్టల్‌ కారిడార్‌తో ప్రజల జీవనాధారం, పర్యావరణం దెబ్బతింటాయని, పోలాకిలో...

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.

 విభజన నేపథ్యంలో విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఎంవిపిలో విశాఖ జూనియర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ భవిష్యత్‌లో విశాఖ అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందనుందన్నారు. విశాఖ జూనియర్స్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, వీటివల్ల బాలలలో ప్రతిభ పాటవాలను వెలికితీసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీలలో విజేతలుగా ఎవరు గెలిచినప్పటికి అందరు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే...

భారతదేశ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. సోమవారం రాత్రి ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన 'సేవ్‌ ప్లబిక్‌సెక్టర్‌-సేవ్‌ ఇండియా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం ద్వారా బ్రిటీష్‌ పాలకులను వెళ్లగొట్టగలిగినా, వారి విధానాలను మాత్రం మన పాలకులు అనుసరిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఈ విధానాలను మరింత వేగంగా అమలుచేస్తోందన్నారు. కార్మిక చట్టాల మార్పు, పిఎఫ్‌ నిధులను షేర్‌ మార్కెట్‌కు తరలింపు, బీమా, రైలు, రక్షణ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ప్రజా భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో...

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు. విమానయాన రంగం, గనులు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేం దుకు వ్యూహం రచించారని విమర్శించారు. పైపెచ్చు...

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు. విమానయాన రంగం, గనులు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేం దుకు వ్యూహం రచించారని విమర్శించారు. పైపెచ్చు...

Pages