District News

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
    ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ విమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం మొదటి దశ పూర్తయి మూడేళ్ళు అయినా రాష్ట్రప్రభుత్వాలు వివక్షత, నిర్లక్ష్యం వల్ల నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు విమ్స్‌ను ప్రభుత్వ-ప్రైవేట్‌-భాగస్వామ్యం (పిపిపి) పేర బడా కార్పొరేట్‌ సంస్థలకి ధారాధత్తం...

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు...

విశాఖనగరంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కును తరలింపును, దాన్ని ప్రభుత్వ`ప్రైవేట్‌`భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని సిపిఐ(యం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1971లో 625 ఎకరాల విస్తీర్ణంలో జూ పార్కు ఏర్పడిరది. ఇది రెండు కొండల మధ్య, ఒకవైపు నేషనల్‌హైవే మరోవైపు సముద్రతీరం మధ్య ఉంది. ఇది వన్యప్రాణులకు సంరక్షణార్ధం ఎంతో ఉపయోగకరంగా ఉంది.  పిల్లలకు, పెద్దలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది అతిపెద్ద జంతుప్రదర్శనశాల. రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం దీనిని తరలించి ఆస్థానంలో నైట్‌ సఫారీ, కాసినో క్లబ్‌లు వంటివి ఏర్పాటు చేస్తామని పేర్కొనడం దుర్మార్గం. విశాఖనగరంలో విలువైన ప్రభుత్వ భూములను విదేశీ...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనను నిరసిస్తూ, అవినీతి వ్యతిరేక దినంలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం వివిధ రూపాల్లో ఆందోళనలు, సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు ఇంకెంతమాత్రమూ లేదని , పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలేసే సమయంలో నిజాయితీగలవారైతే రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రభుత్వమే వారిపై చర్య తీసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపాలిటీలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు.

విశాఖ కెజిహెచ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ సిపియం పార్టీ ఆద్వర్యంలో  సంతాల సేకరణలో పాల్గొన్న బి.వి.రాఘవులు ... 

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఆరోగ్యం నుండి కాపాడేది కేజిహెచ్‌. అటువంటి కేజిహెచ్‌లో కార్డియాలజీ విభాగాన్ని ప్రభుత్వం కేర్‌ కార్పొరేట్‌ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే కార్డియాలజీ విభాగానికి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని విజ్ఞప్తి చేస్తోంది.
    ప్రస్తుతం గుండెజబ్బుకు వైద్యం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. పేదలు ప్రైవేట్‌ వైద్యం చేయించుకోలేక కేజిహెచ్‌లోనే వైద్యం చేయించుకుంటున్నారు. రోజుకు రెండువేల...

ఈ రోజు విశాఖ లో జరిగిన అవినీతి వ్యతిరేక సభలో బి.వి. రాఘవులు గారు మాట్లాడుతూ ... ఏడాది కాలంలోనే తాము అవినీతి పార్టీలేనని బిజెపి, టిడిపి  రుజువు చేశాయన్నారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన కాంగ్రెస్ కు భిన్నంగా నీతిమంతమైన పాలన అందిస్తామని ప్రచారం చేసారు. అధికారం చేపట్టిన నాటి నుండి బిజెపి, టిడిపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తున్నాయి . దేశ, విదేశ భాహుళజాతి కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి  బిజెపిని గెలుపించుకున్నయన్నారు.  గెలిచినా తరువాత వారి రుణం తీర్చుకుంటున్నాడు  మోడీ . అందువలనే  దొంగల ముటాకు సహకరించడం, తద్వారా  తాము  వాటాలు పంచుకుంటున్నారు. మతోన్మాదంలో తప్ప ఎందులోనూ తాము కాంగ్రెస్ కు భిన్నం కాదని బిజెపి, టిడిపి రుజువు చేసుకున్నాయి. బిజెపి, టిడిపి...

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

విశాఖ మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో స్మార్ట్‌ విశాఖ కాస్తా చెత్త విశాఖ‌గా మారిపోయింది. గత ఆరు రోజులుగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతున్న త‌రుణంలో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు వ‌ర్షం ప‌డ‌తే రోడ్డు‌లు అస్త‌వ్య‌స్తంగా త‌యారవుతున్నా‌యి. దాని వ‌ల‌న అంటువ్యా‌ధులు ప్ర‌భ‌లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తు‌న్నా‌రు.

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు. వీరికి సుమారు 2 కోట్ల 26 లక్షల 98 వేలు పంపిణీ చేస్తామని NREGS, కాఫీ బోర్డ్ అధికారులు ప్రకటించారన్నారు . కానీ నేటికి సిల్వర్ ఒక్...

Pages