District News

 సెప్టెంబర్‌ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక‌వ‌ర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల‌ని సిఐటియు నాయ‌క‌త్వంలో భారీ స్కూట‌ర్ ర్యాలీ జ‌రిగింది. ఈ స్కూట‌ర్ ర్యాలీ జివిఎంసి కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభ‌మై జ‌గ‌దాంబ‌, క‌లెక్ట‌ర్ ఆఫీస్‌, చౌట్రీ, పూర్ణామార్కెట్‌, కొత్త‌రోడ్‌, రైల్వేస్టేష‌న్‌, గురుద్వార్‌, హెచ్‌.బి.కాల‌నీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మ‌ద్దిల‌పాలెం, కాంప్లెక్స్ మీదుగా జ‌గ‌దాంబ సిఐటియు కార్యాల‌యం వ‌ర‌కు జ‌రిగింది. సుమారు 40 కిలోమీటర్లు తిరిగారు.  సెప్టెంబ‌రు 2న స‌రస్వ‌తీ పార్కు నుండి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని దీనిలో పెద్ద ఎత్తున కార్మిక‌వ‌ర్గం పాల్గొవాల‌ని సిఐటియు న‌గ‌ర కార్య‌ద‌ర్శి ఎం.జ‌...

2015 ఆగ‌స్టు 31
    పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో  ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి ఇళ్ళను 100 చ‌ద‌ర‌పు గ‌జాలు వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం 12-8-2015న జివోనెంబర్‌ 296ను విడుదల‌ చేసింది. ఈ జివో ప్రకారం పేదలు ఆగష్టు 15 నుండి దరఖాస్తును ‘మీసేవా’ ద్వారా తహశీల్ధార్‌ కార్యాయాల‌కు పంపించుకోవాల‌ని తెలియజేసింది. జివో విడుదలై 15రోజులు దాటినప్పటికీ ‘మీసేవా’లో ఇళ్ళ క్రమబద్ధీకరణ దరఖాస్తు ఇవ్వటం గాని లేదా తీసుకోవటం గాని జరగటం లేదు. ఇప్పటివరకు విధి విధానాల‌ను కూడా ప్రజల‌కు తెలియజేయలేదు. ఫలితంగా విశాఖ‌న‌గ‌రంలో ప్రభుత్వ భూముల్లో సుమారు 70వేమంది ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్నప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై...

2015 ఆగష్టు 31    
    నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల‌కు నిరసనగా సిపియం గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు సోమవారం మద్దిపాలెం జంక్షన్‌లో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారీగా ప్రజల‌పై భారాలు పడుతున్నాయి. ధరలు పేద, సామాన్యుడుకి అందని ద్రాక్షగా ఉంది. ఉల్లి, కందిపప్పు ధరలు ఇక చెప్పనవసరం లేదు. దళారులు, పెట్టుబడిదారుల‌కు ఈ ప్రభుత్వాలు దాసోహం చేస్తున్నాయి. ఉల్లిపాయలు సబ్సిడీ ద్వారా 20 రూ॥కే అందజేస్తున్నామని ప్రభుత్వం భారీగా ప్రకటనలు చేస్తోంది. కాని రైతు బజార్ల ద్వారా తెల్లరేషన్‌కార్డు ఉంటేనే ఇస్తున్నారు. ఆ...

1. పంచగ్రామాల‌ భూ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. 2008లో దేవస్థానం 419 ఉన్న ఇళ్ళ నిర్మాణాల‌పై సర్వే చేసిన వాటి ఆధారంగా 12149 ఇళ్ళను క్రమబద్దీకరణ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 60చ॥గజాల వరకు ఉచితంగా, 61-300 చ॥గజాల‌ వరకు 1998 నాటి భూ మలువలో 70శాతం మరియు 9శాతం వడ్డీ, 301 చ॥గజాల‌ పైబడిన వాటికి (రెండోకేటగిరి విలువ మరియు) ప్రస్తుత భూ విలువపై గృహయజమానులు ప్రభుత్వానికి డబ్బుచెల్లించి క్రమబద్దీకరించుకోవాల‌ని ప్రభుత్వ క్యాబినెట్‌ ప్రకటించింది.
    2. ప్రభుత్వం ప్రకటించిన పరిష్కారం ప్రజల‌ దగ్గర నుండి డబ్బు గుంజి ఖజానా నింపుకునేలా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) భావిస్తున్నది. ఆ భూముల‌పై...

     ఈ రోజు సిపియం పార్టీ నాయకులు లాజిస్టిక్‌ హబ్‌ భూ సాగుదార్లు, జిల్లా కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి నష్టపరిహారం విషయంలో సాగుదార్లుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యన్నారాయణ, గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి భూ సాగుదార్లు అందరికీ చట్టం ప్రకారం రావల్సిన పరిహారాన్ని, బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 
       ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కు  మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్‌ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, మ్లారు, ఎరుకువానిపాలెం...

పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. కేబినెట్‌ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో నగర కార్యదర్శి బి.గంగారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు...

రాష్ట్ర విభజన సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయల‌సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల‌కు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకేంద్రంగా రైల్వేజోన్‌ వంటివి అనేక వాగ్ధానాలు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి మాటతప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి ప్రభుత్వం చెపుతుంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై అఖిల‌పక్షాల‌ మద్దతు తీసుకొని ఒత్తిడి తేవడంలో విఫల‌మయ్యింది. నేడు ప్రత్యేక హోదాకై వామపక్షపార్టీలు బంద్‌ నిర్వహిస్తే దానికి సహకరించాల్సిన ప్రభుత్వం పోలీస్ బల‌గాల‌ను ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేయించడం అత్యంత దుర్మార్గం.  ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి వీడాల‌ని...

విశాఖనగరంలో ఉల్లిపాయలు ధరలు పెరగడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కేవలం రైతు బజార్లలో మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయ‌లు సరఫరా చేస్తున్నది. తక్కువ కౌంటర్ల వల‌న ప్రజానీకం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోజువారి కూలిని కూడా కోల్పోతున్నారు. తక్షణం ప్రతి రైతుబజారులో కనీసం ఐదు కౌంటర్లు ప్రారంభించాలి. ప్రతి రేషన్‌డిపోలోనూ, మున్సిపల్‌ వార్డు ఆఫీస్‌ల‌ వద్ద సబ్సిడీ ఉల్లిపాయల‌ను సరఫరా చేయాల‌ని సిపియం పార్టీ కోరుచున్నది. ప్రస్తుతం త్లెరేషన్‌కార్డుదారుల‌కి మాత్రమే ప్రభుత్వం ఉల్లిపాయులు సరఫరా చేయడం చాలా అన్యాయం. వివక్షత కూడా. గులాభీరంగు కార్డుదారుల‌కు కూడా ఉల్లిపాయలు ఇవ్వాల‌ని సిపియం డిమాండ్‌ చేస్తున్నది. అలాగే...

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

సహకార సంఘాల (PACS) ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి .. సహకార సంఘాల ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి .... డి.సి.సి.బి ఉద్యోగ నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ లకు ఇచ్చిన కోట కొనసాగించాలి ....
...

 విశాఖలో బాక్సైట్‌ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్‌ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్‌ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ ఖనిజం మొత్తం 550 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దీనికి రూ.11,400కోట్లుగా లెక్కకట్టి, తర్వాత ఒప్పందంలో రూ.2800 కోట్లకు...

Pages