District News

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు లాఠీఛార్జీ చేయడం, సొమ్మసిల్లి పడిపోయిన వారిని కూడా బూటు కాళ్లతో తొక్కడం, బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించిన తరువాత కూడా పిడిగుద్దులకు దిగడం వంటి చర్యలు ఏ నాగరికతకు వారసత్వమో పోలీసు...

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గిరిజనులు మంగళవారం భూ పోరాటం చేశారు. సిపిఎం ఆధ్వర్యాన 60 ఎకరాల సీలింగ్‌ భూముల్లో జెండాలు పాతారు. ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 
మండలంలోని చింతలపూడి పంచాయతీ పరిధిలోని 23, 32, 37 సర్వే నెంబర్లలో 60 ఎకరాల సీలింగ్‌ భూములను గతంలో కొంత మంది స్థానిక గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిచ్చారు. పట్టణ ప్రాంతానికి చెందిన బడాబాబులు గిరిజనులను, పేదలను ప్రలోభాలకు గురిచేసి, డబ్బు ఆశజూపి ఆ భూములను లాక్కొని సొంతం చేసుకున్నారు. దీనిపై 2007లో కలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగించాలని తహసీల్దారును ఆదేశించారు. ఆ మేరకు భూములను గిరిజనులకు అప్పగించినప్పటికీ...

    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు సాగుదార్లను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్‌ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, వల్లూరు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును సేకరిస్తున్నారు. 
    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటివరకు ప్రకటించిన పరిహారం చట్టబద్దమైంది కాదు. దీనిని పెంచాలి. నిర్వాసితులు, ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీలు, ఇతర వృత్తిదార్లకు, యువకులకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి.  వీటన్నింటిపై ఒక స్పష్టమైన, వ్రాతపూర్వక అగ్రిమెంట్‌ వచ్చే వరకు...

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">                'విశాఖ జిల్లా సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించడం నేరమా? చదువుకునే వాతావరణం కలుగజేసేందుకు సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే అణచివేయడమే సమాధానమా? ఉద్యమాల సందర్భంగా లాఠీఛార్జి వంటివి జరిగితే తప్పుచేశామని ఒప్పుకునే అలవాటు పోలీస్‌ ఉన్నతాధికారుల్లో కనిపించేది.. కానీ ఈ నెల 15న విద్యార్థులు, విద్యార్థినులపైకి పోలీసు అధికారులు దుడ్డుకర్రలతో పైశాచికంగా కొట్టినా ఈ ఘటనను టీవీలు, పత్రికల్లో చూసినా...

-  చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం
         ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేసింది. సంపన్నులు, పెద్ద యజమానులు చెల్లించని బకాయిలను ట్రూ అప్‌ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయాలని భావించడం సరికా...

విశాఖ కలెక్టరేట్‌ వద్ద సమస్యలపై శాంతియుతంగా మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు నిర్వహిం చారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా ఎప్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఐటిడిఏ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఎస్‌ఐ సూర్యప్రకాశరావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అప్పారావును అరెస్టు చేశారు. అరకువేలీ, నర్సీపట్నంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. అచ్యుతా పురంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నా, రాస్తారోకో జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ నగర...

విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించాయని, తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి వ్యాధులను అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం ప్రజారోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు టి.కామేశ్వరరావు, బిఎల్‌ నారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖలోనే 7210 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు. డెంగ్యూ కేసులు ఒక్క చిత్తూరు జిల్లాలోనే 700కు పైగా నమోదయ్యాయని...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

2015 సెప్టెంబ‌రు 2
    దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుస‌రిస్తున్న‌ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల‌కు మేం వ్యతిరేకం అని కార్మికవర్గం చాటిచెప్పింది. నేడు దేశవ్యాపితంగా అఖిల‌భారత సమ్మెలో విశాఖనగర కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేసింది.
    నేడు విశాఖనగరంలో తెల్ల‌వారి జామున 5 గంటల‌కే ఆటో కార్మికులు బంద్‌ను నిర్వహించడంతో బంద్‌ వాతావరణం నెల‌కొంది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో పూర్తిగా సమ్మె జరిగింది. చివరకు ప్రైవేట్‌ గంగవరం పోర్టులో కూడా కార్మికులు సమ్మెలో పాల్గొని యాజమాన్యం అనుసరిస్తున్న విధానాల‌కు వ్యతిరేకంగా నిబడ్డారు. ముఠా, ఆటో, బిల్డింగ్‌, తోపుడుబండ్లు, జివిఎంసి పారిశుధ్యకార్మికుల‌తో...

 సెప్టెంబర్‌ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక‌వ‌ర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల‌ని సిఐటియు నాయ‌క‌త్వంలో భారీ స్కూట‌ర్ ర్యాలీ జ‌రిగింది. ఈ స్కూట‌ర్ ర్యాలీ జివిఎంసి కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభ‌మై జ‌గ‌దాంబ‌, క‌లెక్ట‌ర్ ఆఫీస్‌, చౌట్రీ, పూర్ణామార్కెట్‌, కొత్త‌రోడ్‌, రైల్వేస్టేష‌న్‌, గురుద్వార్‌, హెచ్‌.బి.కాల‌నీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మ‌ద్దిల‌పాలెం, కాంప్లెక్స్ మీదుగా జ‌గ‌దాంబ సిఐటియు కార్యాల‌యం వ‌ర‌కు జ‌రిగింది. సుమారు 40 కిలోమీటర్లు తిరిగారు.  సెప్టెంబ‌రు 2న స‌రస్వ‌తీ పార్కు నుండి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని దీనిలో పెద్ద ఎత్తున కార్మిక‌వ‌ర్గం పాల్గొవాల‌ని సిఐటియు న‌గ‌ర కార్య‌ద‌ర్శి ఎం.జ‌...

Pages