District News

అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.

                ఎంతో చరిత్ర కలిగిన తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని కాపాడవల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా మూసివేసి ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనే కుట్రు పన్నుతుంది. గత 18 నెలల నుండి కార్మికులకు జీతాలు లేక ఆకలి బాధతో జీవితాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతులకు 2014-15 సంవత్సరానికి  2 కోట్ల రూపాయలు బకాయి వుంది. ఫ్యాక్టరీ కూడా శిదిలావస్థలోకి చేరుకుటుంది. దీనిని వెంటనే ఆదునీకరించాలి. సహకార రంగాన్ని పటిష్టపర్చాల్సిన ప్రభుత్వమే నిర్వీర్యంచేస్తుంది. ఒకవైపు పెట్టుబడులను...

     ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. 
వినతి పత్రంలోని వివరాలను వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, సెక్షన్‌ 94(2)లోని మౌలిక వసతుల కల్పన, సెక్షన్‌ 93(13 షెడ్యూల్‌)లోని ఐఐఎం, గిరిజన యూనివర్శిటీ, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి వాటిపై తక్షణమే స్పందించాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం సాగునీటి సౌకర్యం లేకపోవడమేనన్నారు. పేదరికంతో ప్రజలు వలసలు పోతున్నారన్నారు....

             భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ ఔషద్‌ కంపెనీకి అనుబంధంగా కంచేరుపాలెంలో యూనిట్‌ 3 పేరుతో చేపట్టనున్న విస్తరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అర్హులైన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ వనరులన్నింటిని వినియోగించుకుని 2001లో ఔషదపరిశ్రమ నెలకొల్పిన దివీస్‌, స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. దీనినుంచి వెలువడుతున్న కాలుష్య...

           విశాఖపట్నం, వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె లోకనాధం, డాక్టర్‌ బి గంగారావు ఆర్‌కెఎస్‌వి కుమార్‌ ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్‌ మేనేజరు రాజీవ్‌ విష్ణోరుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవార స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో జిఎమ్‌ను కలిసి, వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం, 2014లో పేర్కొన్న విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్‌ అంశాన్ని జిఎం దృష్టికి తీసుకెల్లామన్నారు. ఏడాదికి సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోర్టు స్టీల్‌ప్లాంట్‌, సెజ్‌లు, ఫార్మా ఇండిస్టీలు, విద్యాసంస్థలు...

            విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ విస్తరణ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, దీని కోసం వచ్చే నెల 23న నిర్వహించబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు లోకనాథం రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. 'భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ డెక్కన్‌ కెమికల్‌ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించని ఈ కంపెనీ విస్తరణకు అనుమతులు మంజూరు చేస్తే కంపెనీ కార్మికులతో సహా పరిసర రాజవరం, గజపతినగరం, పెంటకోట, వెంకటనగరం, రాజానగరం, కేశవరం, శ్రీరాంపురం, రాజగోపాలపురం ప్రజలకు తీరని...

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. బిసిల నివాస ప్రాంతాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని తెలిపారు....

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం 'బాక్సైట్‌ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం' అంశంపై ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపర్చేందుకు గిరిజనులంతా ఏకోన్ముఖంగా కదలాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు అన్‌...

దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల‌ ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్ర‌మంత్రులైన బండారు, స్మృతి ఇరానీల‌ను కూడా  కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్‌ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతుల‌ను బహిష్కరించి  భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల‌ నుండి ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాల‌ని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. నేడు జరిగిన బంద్‌లో సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు, నగర, జిల్లా కార్యదర్శులు బి.గంగారావు, కె.లోకనాధం గార్లు కూడా పాల్గొని తమ మద్దతు తెలియజేసారు. ఇత‌ర వామ‌ప‌క్ష‌పార్టీలు,...

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మంగళవారం ఉదయం విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్లో పోలీసు బాధిత కుటుంబాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో మౌలికసదుపాయాల...

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల...

Pages