తుమ్మపాల సుగర్‌ ఫాక్యరీ పోరాటానికి సిపియం పార్టీ సంపూర్ణ మద్ధతు.

అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.

                ఎంతో చరిత్ర కలిగిన తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని కాపాడవల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా మూసివేసి ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనే కుట్రు పన్నుతుంది. గత 18 నెలల నుండి కార్మికులకు జీతాలు లేక ఆకలి బాధతో జీవితాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతులకు 2014-15 సంవత్సరానికి  2 కోట్ల రూపాయలు బకాయి వుంది. ఫ్యాక్టరీ కూడా శిదిలావస్థలోకి చేరుకుటుంది. దీనిని వెంటనే ఆదునీకరించాలి. సహకార రంగాన్ని పటిష్టపర్చాల్సిన ప్రభుత్వమే నిర్వీర్యంచేస్తుంది. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించడానికి కోట్లు రూపాయలను ఖర్చుచేస్తున్న ప్రభుత్వం సుగర్‌ ఫ్యాక్టరీకి 10 కోట్లు నిధులు కేటాయిస్తే ఇటు రైతులకు, కార్మికులకు మేలు జరుగుతోంది.

                ఎన్నికల సందర్భంగా తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ ఆదునీకరణ చేస్తామని చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. అధకారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా నేటికీ దానికోసం ఆలోచించకపోవడం సిగ్గుచేటు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సుగర్‌ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని సిపియం పార్టీ హెచ్చరిస్తుంది.