District News

విశాఖ జిల్లా గ్రంథాలయ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు మౌనదీక్ష చేపట్టారు. ఎయు మాజీ వీసీ ప్రొఫెసర్‌ కెవి రమణ దీక్షను ప్రారంభించగా, పౌర గ్రంథాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు బిఎల్‌ నారాయణ అధ్యక్షత వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సాగిన దీక్షను పలువురు ప్రముఖులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజరుశర్మ మాట్లాడుతూ, స్వార్థం కోసం కనీస విలువలు పాటించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ పదవులు పొంది ప్రభుత్వ స్థలాలను...

కిడ్నాప్‌ చేసిన ముగ్గురు గిరిజన నాయకుల విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు మరో 36 గంటల్లో ముగియనున్నా.. ఇంతవరకూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. దీంతో కిడ్నా్‌పకు గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. సోమవారం విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాక్సైట్‌ తవ్వకాల అంశంపై ప్రభుత్వ వైఖరిని 13వ తేదీలోగా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేయగా, ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు...

 ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ప్రభుత్వ విధానాల కారణంగా ఏర్పడు తున్న సమస్యలపై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని సిఐటియు కార్యాల యంలో ఆదివారం పబ్లిక్‌ సెక్టర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యాన ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలను ఎలా ప్రతి ఘటించాలన్న అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేమి, ప్రయివేటీకరణ ముప్పు వంటి కారణాల వల్ల భవిష్యత్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్‌లో వాటాల విక్రయం ద్వారా ప్రయివేటు వారికి ప్రభుత్వం కట్టబెడుతుందని వివరించారు. విశాఖ పోర్టు ప్రయివేటీకరణలో...

పెంచిన జీతాలు, ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్‌ కార్మి కులు ధర్నాలు నిర్వహించారు. విశాఖలో జివిఎంసి కార్యా లయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.11వేలు అమలు చేయాలని, ప్రతి నెలా 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, గుర్తింపు యూనియన్‌ 41 ప్యాకేజీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి అంజిబాబు మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా...

 విశాఖ జిల్లాలోని పలు ప్రయివేటు పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు విమర్శించారు. తెలుగుదేశం పాలన పూర్తిగా కార్మిక హేళనకు మచ్చుతునకగా ఉందని అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 28న గంగవరం పోర్టులోనూ, పరవాడ ఫార్మాసిటీ సాయినార్‌ కంపెనీల్లోనూ ప్రమాదాలు జరిగి ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు. ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోగా విప్‌ల సదస్సులో పాల్గొనడానికి విశాఖ విచ్చేసిన చంద్రబాబు కార్మిక పోరాటాలను అణచివేస్తామని చెప్పడం ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు....

భారతదేశంలో ఉన్నది పాసిస్టు ప్రభుత్వం కాకపోయినా పాసిస్టు పోకడలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆలిండియా విప్స్‌ సదస్సులో పాల్గొనటానికి విశాఖ వచ్చిన బేబీ బుధవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అగ్రవర్ణాల సహకారంతో బడుగు, బలహీన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేయాలని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రకటన చేయడం అందులో...

విశాఖలోని గంగవరం పోర్టులో మృతి చెందిన కార్మికుడు రాజారావు కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు సోమవారం ఆర్ధరాత్రి దాటాక పోర్టు గేటు వద్ద ఉన్న 130 మంది కార్మికులు, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. రాజారావు విధి నిర్వహణలో ఉండగా సోమవారం మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు నష్ట పరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు మృతదేహంతో పోర్టు గేటు వద్ద బైఠాయించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో సోమవారం రాత్రి అక్కడే ఆందోళన...

గంగవరం పోర్టు యాజమాన్య నిరంకుశత్వానికి సోమవారం ఓ కార్మికుడు మృతి చెందాడు. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజారావు(40) పోర్టులో అగ్రికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పోర్టుకు కిలోమీటరు దూరంలో రాజారావుకు సంబంధం లేని గోతులు తవ్వే పనిని యాజమాన్యం అప్పగించింది. పని ప్రదేశంలో మంచినీరు కూడా లేదు. పనిచేస్తుండగా రాజారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతిచెందిన రాజారావును చికిత్స పేరుతో దొడ్డిదారిన మల్కాపురంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు. నష్ట పరిహారం చెల్లించేవరకు మృతదేహాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో...

ఈ రోజు (28-9-2015)న మధ్యాహ్నాం పరవాడ జవహర్‌లాల్‌ ఫార్మాసిటీలో సాయినార్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా, మరో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన క్షతగాత్రులను విశాఖలోని న్యూ కేర్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్, అధ్యక్షులు జి.కోటేశ్వరరావు.

ఈ ఘటనపై సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం మాట్లాడుతూ ఫార్మా కంపెనీల్లో కనీస భద్రతా చర్యలు కూడా పాటించకుండా అధిక ఉత్పత్తికి అధికవత్తిడి పెట్టడడమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తున్నది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా...

Pages