District News

ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎఎన్‌-32 ప్రమాద దుర్ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తొలుత బుచ్చిరాజుపాలెంకు చెందిన నమ్మి చిన్నారావు, లక్ష్మీనగర్‌కు చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. అనంతరం అక్కడ నుంచి వేపగుంటలోని గంట్ల శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలోని సాంబమూర్తి ఇళ్లకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి మనోధైర్యం కలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఐదు రోజులైందని, గాలింపు చర్యలను నేవీ బృందాలు ముమ్మరం చేశాయని తెలిపారు. విమాన అదృశ్య ప్రమాదంలో 29 మంది...

             జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని, సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ జికె.వీధి మండలానికి చెందిన దారకొండ, ఎ.దారకొండ, గాలికొండ, పెదవలస, దేవరాపల్లి, వంచుల, జర్రెల పంచాయతీల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసినా గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. వర్షాల...

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

               విశాఖలో మంచినీటి వ్యాపారం కోసం రైతుల పొట్టగొట్టి రైవాడ నుంచి అదనంగా 150 క్యూసెక్కుల నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో రైతులతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైవాడ నుంచి విశాఖకు అదనంగా నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైవాడ నీటిని రైతులకే పూర్తిగా అందిస్తామని, రిజర్వాయర్‌ను రైతులకు అంకితం చేస్తామని అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అదనంగా నీటిని తరలించుకుపోవడానికి నిర్ణచయించడం దారుణమన్నారు. ఒక పక్క అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రైవాడ...

               ఓలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన 9 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఫ్యాక్టరీ కార్మికులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నర్సీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజు మాట్లాడుతూ నర్సీపట్నం మండలం అమలాపురంలోని ఓలం జీడిపిక్కల కర్మాగారంలో 13 సంవత్సరాల నుండి మహిళలు, అనేక మంది కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 9 మందిని మార్చి 20వ తేదీ నుండి ఫ్యాక్టరీలో పని చేయడానికి ప్రవేశం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఆటంకపర్చారని చెప్పారు. ఎటువంటి కారణం లేకుండా ఈ 9 మంది కార్మికులను తొలగించారని, దీనిపై ప్రశ్నిస్తే వయస్సు మీరిందని, అందువల్ల...

గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..

              కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతుగా బుధవారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో వారు పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి ఏజెంటుగా పని చేస్తున్నారని, జీతాలు పెంచమంటే నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారని తెలిపారు. పోలవరం కాలువకు సంబంధించి జిఒల కంటే ఎక్కువగా బిల్లులు ఇచ్చారని, కాని ఇక్కడ మహిళా కార్మికులకు జీతాలు పెంచడానికి జిఒల పేరుతో తప్పించుకుంటున్నారని విమర్శించారు. విధులకు వెళ్లిన...

 - వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక వైద్య శిబిరాలు
 - బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ 
 - సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌
 - పనసపుట్టు గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం
              హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యాన్ని పట్టి పీడిస్తున్న ఆంత్రాక్స్‌ మహ్మామారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నిపుణులైన డాక్టర్లతో 
ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి...

  (visakha rural)          అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కార్మికులపై యాజమాన్యం, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం అడ్డురోడ్డు కూడలి వద్ద చేతులకు సంకెళ్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం బ్రాండిక్స్‌ యాజమాన్యానికి తొత్తుగా మారారని విమర్శించారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.అప్పలరావు మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న బ్రాండిక్స్‌...

(visakha rural)

             పెట్రో కారిడార్‌ కోసం చేపడుతున్న భూసేకరణపై 'యథాతదస్థితి' (స్టేటస్‌కో)ని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పట్ల సిపిఎం, ఇండిస్టియల్‌ పార్కు నిర్వాసితుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సిపిఎం, నిర్వాసితుల సంఘం నాయకులతో కలిసి విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పిసిపిఐఆర్‌ పేరిట 2010లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, దీనినే నేడు విశాఖ-చెన్నై కారిడార్‌గా మార్పు చేశారని తెలిపారు. 2,600 ఎకరాల జిరాయితీ భూముల సేకరణకు 4(1) నోటీసులు ఇచ్చిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిసర...

Pages