2015

మధు అరెస్ట్ పై ఆందోళన..

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మధు అరెస్టుకి నిరసనగా విజయవాడలో చంద్రబాబు దిష్టి బొమ్మను సిపిఎం కార్యకర్తలు దహనం చేశారు. పోలంకి గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుపుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పుగా చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వాళ్లపై చంద్రబాబు నిరంకుశంగా వ్యవహారిస్తున్నాడని అన్నారు.

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఎవరి కోసం?

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని 'ముచి-పిచి' పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి.

మైనార్టీల సమస్యలపై సదస్సు..

నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు.

కాంగ్రెస్‌ గతే బిజెపికీ:CPM

రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని, రాష్ట్రవిభజన బిల్లులో హామీలు నెరవేర్చాలని కోరుతూ మంగళవారం ది బెజవాడ బార్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహాదీక్షకు సిపిఎం పూర్తి మద్దతు తెలిపింది. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ నేతృత్వంలో సిపిఎం బృందం మంగళవారం నిరాహాదీక్ష చేస్తున్న బార్‌ అసోసియేషన్‌ నాయకులకు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటతప్పారని విమర్శించారు.

GSTపై సందేహలు:ఏచూరి

జీఎస్టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన విధానంపై. సీపీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లుపై అనేక సందేహాలున్నాయని... వాటికి సమాదానాలు చెప్పకుండానే.. బిల్లును ఎలా పాస్‌ చేయించుకుంటారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కీలకమైన బిల్లులపై సాదారణంగా సభలో చర్చ జరగటం ఆనవాయితీ అని... ఆ తర్వాత బిల్లును ప్రవేశపెడతారని గుర్తు చేశారు. జీఎస్ టీ బిల్లు విషయంలో సంప్రదాయలు పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగ‌పూరా?..ఇస్తాంబులా..?

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల నుండి భయపెట్టి ఇప్పటి వరకు 33,500 ఎకరాల భూమి తీసుకున్న ప్రభుత్వం సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఊహాచిత్రాలు విడుదల చేసి రాజధాని నిర్మాణం ఆగమేఘాలమీద జరిగిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. రెండు రోజుల నుండి పత్రికల్లో (ముఖ్యమంత్రి అనుకూల పత్రిక) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనల తీరు మారింది. టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్‌ తరహాలో నిర్మాణం చేపడతామని వార్తలు లీక్‌ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

Pages

Subscribe to RSS - 2015