2015

పనికిరాని నిబంధనలతో పంచాయతీ ఎన్నికలా? సిపిఎం

రోహతక్‌: పంచాయతీ రాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు విద్యార్హతలతో సహా పలు అంశాల్లో నిబంధనల్ని కఠినతరం చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సిపిఎం రాష్ట్ర శాఖ ఒక బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త నిబంధనలు పూర్తి అప్రజాస్వామికమని సిపిఎం వ్యాఖ్యానిం చింది. పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు కనీస విద్యార్హతగా మెట్రిక్యులేషన్‌ను నిర్ణయించింది. 

స్మార్ట్‌ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం

''స్మార్ట్‌ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏ పనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్‌ మనే లైట్లు- 'వావ్‌' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయా లేక స్మార్ట్‌ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరగబోతోందా?

OROPపై మోడీ నోరువిప్పాలి:బృందా

ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ (ఒఆర్‌ఒపి) విధానం అమలుపై ప్రధాని మోడీ నోరు విప్పాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కారత్‌ డిమాండు చేశారు. ఒన్‌ ర్యాంక్‌, ఒన్‌ పెన్షన్‌ అమలు చేయాలని డిమాండు చేస్త జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం నుంచి ఇద్దరు మాజీ సైనికోద్యోగులు నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. గత అనేక నెలలుగా మాజీ సైనికోద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం తరపున సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కారత్‌ కూడా వీరికి సంఘీభావం తెలిపారు. తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బృందా కారత్‌ను మాజీ సైనికోద్యోగులు స్వాగతం పలికారు.

Rss గుప్పిట విద్యాసంస్థలు..

దేశంలోని విద్యాసంస్థలను ఆరెస్సెస్‌ తన గుప్పిట బంధించిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. గజేంద్ర చౌహాన్‌ను పూణె ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసింది. అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్‌ కబంధహస్తాల్లో సృజనాత్మకత నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని, బీజేపీని కీర్తించడమే ప్రాతిపదికగా అనర్హులకు పదవులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రామిక జన శంఖారావం సిడి

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు.

పోలవరం ముంపు మండలాల్లో 20న బంద్‌కు పిలుపు..

ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముంపు మండలాల్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు.

పోలీస్ కేసులకు భయపడొద్దు:మధు

'పోలీసు కేసులకు భయపడితే ఎయిర్‌పోర్టుకు భూములు పోవడం ఖాయం. కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన కౌలువాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. ప్రజాప్రతిఘటన ముందు అన్నీ బలాదూరేనని అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం తొలుత చెప్పిందని, ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గి 5,551 ఎకరాలకు దిగివచ్చిందని తెలిపారు.

వైద్యం ప్రభుత్వ బాధ్యతే:సిపిఎం

ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి 47వ వార్డు పరిధి గుల్లలపాలెం జివిఎంసి ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్ని నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారని, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల్లో రెండు డిస్పెన్షరీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పేరుకే 30 పడకల ఆసుపత్రులైనప్పటికీ, కొన్ని వ్యాధులకే మందులుంటున్నాయని పేర్కొన్నారు.

బాబు జపాన్ కు దాసోహం:BVR

శ్రీకాకుళం పోలాకీ లో  విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా 1,890 ఎకరాల భూమి సేకరిస్తోందని,టెండర్లు కూడా పిలవకుండా జపాన్ కు చెందిన సుమోటోమీ కంపెనీకి భూములను రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. 

Pages

Subscribe to RSS - 2015