ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మేడే రోజున రవాణా కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించి, కార్మికుల పక్షాన ఉన్నట్లు పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రకటన వెనుక కూడా కారణముంది. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి, సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసి కార్పొరేట్ సంస్థలు కార్మికులను మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేశాయి. కార్మికులు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమాను ప్రభుత్వం ప్రకటించింది తప్ప, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కాదు. ఇది కార్మికులకు శాశ్వత పథకం కాదు.