దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావాలనీ, గ్రామీణ ప్రాం తాలకు కూడా బ్యాంకులు విస్తరిం చాలనీ, దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు ఎంతో కృషి చేయాలనీ, ఇవి సాధించటం కోసమే 'ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన' ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలు, మంత్రివర్యుల ఉపన్యాసాలు వింటుంటే విస్మయం కలుగుతుంది. బ్యాంకింగ్‌రంగం ఇంకా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పం తోనే బ్యాంకింగ్‌రంగ సంస్కరణలు చేపట్టామని పాలక పక్షాలు ప్రచారం చేయటాన్ని సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకుల జాతీయకరణ జరిగి 46 ఏళ్లు నిండాయి.