2015

అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు..

 ''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్‌ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్‌ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది.

పేదలపట్ల వివక్షతా?: బాబురావు

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు.

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన..

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు.

NDAపై అమర్థ్యసేన్‌ విమర్శలు

విద్యావ్యవస్థల్లో హిందుత్వ భావాలు జొప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర జోక్యం చేసుకుంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్‌ వాపోయారు. విద్యా సంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసు కోవడం సర్వసాధా రణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రాజకీయ జోక్యానికి ఇది పరాకాష్టని అన్నారు. గతంలో యూపిఎ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నప్పటికీ పరిధి దాటలేదని ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం పదేపదే తలదూరుస్తూ బిజెపి విధానాల్ని విద్యావ్యవస్థలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

నియంతృత్వ పోకడ..

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్‌ ఫోన్‌ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి.

త్వరలో పోలకిలో పర్యటన: మధు

శ్రీకాకుళం జిల్లా పోలాకి ధర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని ఖండించాలని శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఉపాధి కలగకపోగా రైతులకు , వ్యవసాయ కూలీలకు వున్నా ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు .. అభివృద్ధి పేరుతొ రైతుఅల్ నోట్లో మట్టి కొట్టాలని చుస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ,త్వరలో పోలకిలో పర్యటిస్తామని అన్నారు. 

సూర్యకాంత మిశ్రా కాన్వారుపై తృణమూల్‌ దాడి..

హౌరా జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డా.సూర్యకాంత మిశ్రాపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు పట్టపగలు దాడికి తెగబడ్డారు. రాజాపూర్‌ ప్రాంతంలో డా.మిశ్రా కారును అడ్డుకున్న తృణమూల్‌ గూండాలు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయన్ను అనుసరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి విప్లవ్‌ మజుందార్‌, మీడియా ప్రతినిధులు వున్న వాహనాలను కూడా వారు ధ్వంసం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన జగత్‌వల్లభ్‌పూర్‌, అమ్‌తా, ఉదరు నారాయణ్‌పూర్‌ తదితర ప్రాంతాలలో ప్రజలను పరామర్శించేందుకు మిశ్రా గురువారం అక్కడికి వెళ్లారు.

ప్రమాదకర పట్టణ సంస్కరణలు..

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పట్టణాలకు ర్యాంకులు ఇస్తోంది. పరిశుభ్రతలో మన రాష్ట్రంలోని నగరాలు దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే వెనుకంజలో ఉన్నాయని ప్రకటించారు. కేంద్ర పథకాలలో ఎంపిక చేయడానికి మన రాష్ట్రంలోని నగరాల మధ్య పోటీపెట్టి స్మార్ట్‌ నగరాలను గుర్తించారు. ఏ పట్టణాలలో దోమల సైజు ఎక్కువగా ఉంది?(దోమలు ఈగల సైజుకు మారుతున్నాయి). చెత్తకుప్పలు ఏ నగరంలో ఎక్కువగా పేరుకుని ఉన్నాయి? మంచినీరు ఎన్ని రోజులకొకసారి ఇస్తున్నారు? పన్నులు ఏ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి? పై అర్హతలు పెడితే మన పట్టణాలు మొదటి ర్యాంకుల్లో ఉంటాయి. తెలుగుదేశం, బిజెపి పాలనలో ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం?

ఉక్కుఫ్యాక్టరీ కోసం CPM..

ఉక్కఫ్యాక్టరీ తరలింపు నిర్ణయంపై సోమవారం కడప జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విమానాశ్రయం గేటు ఎక్కిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Pages

Subscribe to RSS - 2015