October

సీపీఐ ‘పముజుల’పై హత్యాయత్నం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పముజుల దశరథరామయ్యపై నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరులో మంగళవారం హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రూ.5లక్షలతో పంచాయతీ డ్రైనేజీ కాలువ నిర్మిస్తోంది. అయితే, హైస్కూల్‌ కూడలిలో స్థానికంగా నివాసముండే బట్టేపాటి ప్రతాప్‌ కాలువ తమ స్థలంలో ఉందంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. గ్రామపెద్దలు, సీపీఐ సీనియర్‌ నేత పముజుల దశరథరామయ్య జోక్యం చేసుకుని డ్రైనేజీ కాలువ పూర్తిగా పంచాయతీ స్థలంలో ఉందని, రెవెన్యూ సర్వే ప్రకారమే నిర్మాణం జరుగుతోందంటూ తేల్చి చెప్పారు. అయినా మాటవినని ప్రతాప్‌ పముజులపైకి దూసుకెళ్లాడు.

మా తిండి..మా హక్కు:CPM

దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ఆధిపత్యం పెరిగిందని, ఇప్పుడు ఏకంగా తినే తిండిని కూడా అది శాసించేందుకు కేంద్రంలో మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది, తమ పబ్బం గడుపుకోవడానికి బిజెపి, ఆర్సెస్స్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

బిజెపి కేవలం హెడ్‌లైన్స్‌కే:శౌరి

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వ విధానాలు కాంగ్రెస్‌ ప్లస్‌ ఆవులా ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ మీడియా హెడ్‌లైన్స్‌కే పరిమితమవుతోందని బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ విమర్శించారు. ప్రధాని కార్యాలయం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందని శౌరీ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను గుర్తు చేస్తున్నాయని, అవే విధానాలు..కాకపోతే, కాంగ్రెస్‌ ప్లస్‌ ఆవు అంటూ శౌరీ చమత్కరించారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

 ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు .  చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

AIKS రాష్ట్ర మహాసభలు..

అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సంఘటితంగా పోరాడదామని అఖిల భారత కిసాన్‌ సభ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్‌ పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా సుమారు 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోడీ పాలన చేపట్టాక రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కేంద్ర జ్యోక్యం తగదు:ఏచూరి

ఢిల్లీ పోలీసులు కేరళ హౌస్‌పై దాడి చేయడం ద్వారా నిబంధనలను అతిక్రమించారని సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్రం అనేక నైతిక సూత్రాలను వల్లిస్తుంది కాని అమలు చేయదని విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో నడుస్తున్న అతిథి గృహంలోకి అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించడం, అక్కడి వంటకాలను తనిఖీ చేయడం తీవ్రమైన విషయమని ఆయన చెప్పారు. 

ఇదేనా బాబుగారి సమర్థత...

 ఎన్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.

మార్కెట్లలో ఫెడ్‌ భయాలు..

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న మరోమారు ఊహాగానాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. సోమవారం తొలి గంటలో లాభాల్లో సాగిన మార్కెట్లు అనంతరం మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల వైపు సాగాయి. మంగళవారం నుంచి ఫెడ్‌ సమావేశాలు జరుగనున్నాయని, ఇందులో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని వచ్చిన వార్తల నేపధ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 109 పాయింట్లు కోల్పోయి 27,362కు దిగజారింది. 

మోడీ ధోరణి మారాలి:VSR

దళితులపై నానాటికీ పెరుగుతున్న దాడులను అరికట్టడంలో మోడీ సర్కార్‌ విఫలమైందని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌(డిఎస్‌ఎంఎం) జాతీయ నేత వి.శ్రీనివాసరావు విమర్శించారు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సున్‌పెడా గ్రామంలో దళిత కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఘటనలో చనిపోయిన చిన్నారి దివ్య, వైభవ్‌లకు డిఎస్‌ఎంఎం నివాళులర్పించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కేరళ భవన్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు దివ్య, వైభవ్‌ చిత్రపటాలను చేబూని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

బీఫ్‌ తింటే తప్పేంటి..రాష్ట్రపతికి లేఖ

చెన్నై : బీఫ్‌ తిన్నారని లేదా ఇంట్లో దాచుకున్నారనే అనుమానాలతో దేశంలో జరుగుతున్న హత్యలు, దాడులు పెద్దలనే కాదు, పిల్లలను సైతం కదిలిస్తున్నాయి. ఎ.డి. ఆరుష్‌ అనే ఆరేళ్ల 'రేపటి పౌరుడు' రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. చెన్నైకి చెందిన ఈ పిల్లవాడు ప్రముఖ సిపిఎం నేత యు. వాసుకి మనవడు కావడం విశేషం.

Pages

Subscribe to RSS - October