October

కాశ్మీర్‌ ప్రస్తావనపై భారత్‌ ఆగ్రహం

ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రస్తావించడం పట్ల భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌పై లేని ఆధిపత్యానిన చలాయించేందుకే పాకిస్తాన్‌ ఈ అనవసర పటాటోపాన్ని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్‌ విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ ఇలా అంతర్జాతీయ వేదికను ఉపయోగించు కోవడమంటే దాన్ని దుర్వినియోగం చేయడమేనని భారత్‌ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగ మేనని మరోసారి పునరుద్ఘాటించింది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి.

ఆక్వాఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా

తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

అర్ధ‌రాత్రి సిపియం నాయ‌కుల అర‌స్టుల ప‌ర్వం

  వెంక‌య్య నాయుడు తిరుప‌తికి వ‌స్తున్న సంద‌ర్భంగా రాష్ట్ర‌నికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసాడ‌ని శ‌నివారం ఉద‌యం  నిర‌స‌న కార్యక్ర‌మం త‌ల‌పెట్టారు. ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌గ‌నీయ‌కుండా చేయ‌డానికి అర్థ రాత్రి నుంచి  సిపియం నాయ‌కుల అర‌స్టుచేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు.

గొంతువిప్పినకార్పొరేట్ దిగ్గజం

దేశంలో నేడు మైనార్టీ సముదాయాలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఒక మీడియా ఇంటర్వూలో మాట్లాడుతూ, దేశం ఆర్థిక వృద్ధి సాధించాలంటే భయ వాతావరణాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా ఒక కార్పొరేట్‌ దిగ్గజం గొంతు విప్పడం ఇదే మొదటిసారి. అసహనం తగదని మూడీస్‌ అనాలిటిక్స్‌ మోడీకి సూచన చేసిన తర్వాత నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Rss నిషేధం గుర్తురాలేదా:లెఫ్ట్

దేశంలో ఐక్యత, శాంతి, సామరస్యత వుంటేనే ప్రగతి సాధ్యమంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్దార్‌ పటేల్‌ పేరిట శనివారం ఇక్కడ 'ఐక్యతా పరుగు' (రన్‌ఫర్‌ యూనిటీ) కార్యక్రమం నిర్వహించిన ఎన్డీయే సర్కారుకు అప్పట్లో హోం మంత్రిగా వున్న పటేల్‌ మహాత్ముని హత్యానంతరం ఆరెస్సెస్‌ నిషేధం విధించిన విషయం గుర్తు రాలేదా అని వారు ప్రశ్నించారు. దేశ ఐక్యత, శాంతి, సామరస్యతల కోసం ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రధాని గుర్తించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. వారంతా (ప్రధాని నేతృత్వంలోని కాషాయదళం) ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ సంస్థలకు చెందిన వారే.

దాద్రీ ఘటనకు వినూత్న నిరసన

పిఎల్‌ సుందరం తన పార్టీ కార్యకర్తలతో కలసి 'తమిళ మానిల వివసాయిగళ్‌ సంగం' (తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ కార్మికుల అసోసియేషన్‌) ఇక్కడికి 65 కిలోమీటర్ల దూరంలోని సత్యమంగళంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక ప్యాకెట్‌ను బయటకు తీసి, ఇది గొడ్డుమాంసమని, దీన్ని తాను తింటున్నానంటూ, కొన్ని ముక్కలను ప్రదర్శనకారులకూ పంచిపెట్టారు. ఒక గంట పాటు జరిగిన ఈ నిరసన ప్రదర్శనకు పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.

Pages

Subscribe to RSS - October