October

పేదలకు అందని పోషకాహారం:కారత్

నానాటికీ చుక్కలకెగబాకుతున్న పప్పుల ధరలు పోషకాహారాన్ని పేదలకు అందని మానిపండులా మార్చివేస్తున్నాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్‌గా కిలో రు.220 పలుకుతున్న కందిపప్పు చికెన్‌ కన్నా అత్యంత ఖరీదయిన వస్తువుగా మారిపోయిందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ అన్నారు.

 

అభివృద్ధి - హక్కులు

అభివృద్ధి అనే మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంత్రంలా వినపడుతోంది. ఇంకొక విధంగా చెప్పాలంటే దేశంలో కూడా మన నాయకులు చాలా చోట్ల ఈ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల వేలాది, లక్షలాది మంది ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. అలాగే లక్షలాది ఎకరాలను వివిధ రకాల పేర్లతో సేకరిస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నాం అనే పేరుతో ప్రజల ఆస్తులను, హక్కులను హరిస్తున్నట్లు అనేక వార్తలను చూస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం కదా అని ప్రజలు త్యాగాలు చేయాలి, నష్టాలు భరించాలని చెబుతున్నారు. నాయకులు అభివృద్ధి చేస్తున్నారు కనుక ప్రజలు కష్టాలు భరించాలా?

అవార్డులను ఇచ్చేస్తున్నాం:సినీ ప్రముఖులు

ముంబయి : పురస్కారాల తిరస్కరణ ఇప్పుడు కళారంగాన్ని తాకింది. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టిఐఐ) విద్యార్థులు గత 140 రోజులుగా సమ్మె చేస్తున్న సమ్మెకు సినీరంగ ప్రముఖులు మద్దతు పలికారు. ఎఫ్‌టిఐఐ ప్రతిష్టంభన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పొంచివున్న ముప్పునకు నిరసనగా తమ జాతీయ పురస్కారాలను వెనక్కు పంపుతున్నట్టు 10 మంది సినీ ప్రముఖులు బుధవారం ప్రకటించారు.

నెట్‌ ఉచితంగా కుదరదు:జుకర్

ఇంటర్‌నెట్‌ను అందరికీ ఉచితంగా అందించడం సాధ్యంకాదని భారత పర్యటనలో ఉన్న ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్‌ బుధవారం ఢిల్లీ ఐఐటి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇంటర్‌నెట్‌ న్యూట్రాలిట ీ(తటస్థత)కి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ తటస్థత ఉండాలని, అదే సమయంలో ప్రజలందరికీ ఇంటర్‌నెట్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. 

ప్రభుత్వ వైఖరి మారకపోతే అసెంబ్లీ ముట్టడి..

రాజధాని ప్రాంతానికి భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఏపి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కృష్ణానది ఒడ్డున నివసించే పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నించినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అసైన్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్‌ చేశారు.

ఐక్య పోరాటాలే శరణ్యం:గఫూర్

కార్మికుల మెడలపై కత్తి వేసే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను తిప్పకొట్టడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల ఆవరణంలో నిర్వహించిన సిఐటియు రాష్ట్ర స్థాయి క్లస్టర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. గత కార్మిక చట్టాల్లో ఎనిమిది గంటల పని దినాలు ఉన్నా, వాటిని ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం బిజెపి సవరించి తీరుతామని చెప్పడం విడ్డూరమన్నారు.

పొలాలను నాశనం చేయొద్దు:CPM

పంటలు పండే పచ్చటి పొలాలను, ప్రజల జీవితాలను నాశనం చేసే ఆక్వా ఫుడ్‌పార్క్‌ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో మాట్లాడారు. జనావాసాల ప్రాంతంలో గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ ఫ్యాక్టరీ నిర్మించొద్దని ఏడాదిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 

ప్రపంచబ్యాంకు పథకం ''మేక్‌ ఇన్‌ ఇండియా''

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను రూపొందించిన పథకమం టూ గొప్పగా ప్రచారం చేసుకొంటు న్న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రపంచ బ్యాంకు రూపొందించిన పథకమని స్పష్టమౌతున్నది. 2015 సెప్టెంబ రులో ప్రపంచబ్యాంకు రూపొందించిన ''అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌'' నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. తయారీ సరుకుల ఎగుమతులను, భారతదేశంలో తయారైన సరుకుల పోటీత త్వాన్ని పెంచటానికి సహకరించాలని ప్రధాని మోడీ 2014లో ప్రపంచబ్యాంకును కోరి నట్లు నివేదికకు రాసిన ముందుమాటలో ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ఒన్నో రుహుల్‌ పేర్కొన్నాడు.

Pages

Subscribe to RSS - October