October

లెఫ్ట్‌పై జైట్లీ పెదవివిరుపు..

వామ పక్షాలు భారత్‌లో అసహనాన్ని పెంచి పోషిస్తున్నా యని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపిం చారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక అసహనాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రణాళికాబద్ధమైన ప్రచారం ద్వారా భారత్‌ను అసహన సమాజంగా మార్చేస్తున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలో విమర్శించారు.

చంద్రులు ఒక్కటయ్యారు:తమ్మినేని

ఓటుకు నోటు కేసులో ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఒక్కటయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ...సహారా కేసు విషయంలో 90 ప్రశ్నలకు కెసిఆర్‌ సమాధానం చెప్పాల్సి ఉండగా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్‌ వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆశాల సమ్మె వెనుక ఆంధ్రా కుక్కలున్నాయని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నోరు పారేసుకున్నారని, అదే ఆంధ్రా సిఎం చంద్రబాబు మీద కేసు పెట్టే దమ్మూ ధైర్యం ఈ మంత్రులకు ఎందుకు లేదని ప్రశ్నించారు.

కనీసధర కూడా రాలేదు:కృష్ణన్‌

గిట్టుబాటు ధర లేక చెరకు రైతులు కూడా ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అఖిల భారత చెరకు రైతుల సమ న్వయ కమిటీ కన్వీనర్‌ విజ్జూ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయంతో పోల్చితే మద్దతు ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. చెరకు ఉత్పత్తి వ్యయం టన్ను రూ. 2,500 ఉన్నట్లు కేంద్రమే అంచనా వేసిందన్నారు. 

చట్టాన్ని ధిక్కరిస్తోన్న ప్రభుత్వం:మధు

రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర  ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్‌ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్‌ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు సదస్పు..

ఇస్తాంబుల్‌:కార్మికోద్యమానికి ఎన్నడూ విరామం అనేది వుండదని టర్కీ కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత కేమల్‌ ఒకుయాన్‌ స్పష్టం చేశారు.శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన 17వ అంతరా ్జతీయ కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల సదస్సును టర్కీ కమ్యూనిస్టు పారీ ్ట తరపున ఆయన లాంఛనంగా ప్రారంభించారు.26 దేశాల కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియచేశారు. వీరిలో చైనా కమ్యూనిస్టుపారీ ్ట, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ క్యూబా తదితర పారీ ్టల ప్రతినిధులు మాట్లాడుతూ సోషలిస్టు నిర్మాణంలో తమ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.

మేధావులకు అభినందనలు:CPM

దేశంలో పెరుగుతున్న మత హింస, దబోల్కర్‌, పన్సారే, కల్బుర్గివంటి హేతువాద ఉద్యమ నేతలు, కార్యకర్తల హత్యలు, పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ ప్రభుత్వం, వివిధ సంస్థల నుండి అందుకున్న అత్యున్నత పురస్కారాలను వాపసు చేసి నిరసన వ్యక్తం చేస్తున్న మేధావులను పొలిట్‌బ్యూరో అభినందించింది

RTI కార్యకర్తపై నల్లసిరా..

పుణే : అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుధీంద్ర కులకర్ణిపై నల్ల పెయింట్‌తో దాడి చేసిన తరహాలోనే మరఠ్వాడాలోని లాతూర్‌ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ జిల్లాకు చెందిన రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ (ఆర్‌టిఐ) కార్యకర్తపై శుక్రవారం స్థానిక శివసైనికులు దాడిచేసి తీవ్రంగా కొట్టమే కాక, ఆయన ముఖానికి నల్లరంగు పులిమారు. స్థానిక కళాశాల ప్రాంగణంలోని నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న విషయాన్ని బయటపెడతాననడంతో స్థానిక ఆర్‌టిఐ కార్యకర్త మల్లికారున్‌ భైకత్తిని శివసైనికులు తీవ్రంగా కొట్టి, ఆయన ముఖానికి నల్ల సిరా పూశారు.

మతశక్తులకు మోడీ ఊతం:ఏచూరి

బీహార్‌ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాసులు కాల్చుకుంటారంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్‌షా మత శక్తులను ప్రోత్సహిస్తూ వారికి నాయకత్వం వహిస్తున్నారని శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అవుతుందని, బీహార్‌లో ఢిల్లీ తరహా పరాభవమే ఎదురవుతుందని ఊహించే అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందా?

 ఎంతో కాలం నుంచి పెట్టు బడిదారులు, ఉన్నత, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తు న విధంగా రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) ఛైర్మన్‌ రఘురామ్‌ రాజన్‌ వడ్డీ రేట్లను తగ్గించారు. సెప్టెంబరు 29న జరిగిన రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఊహించిన వారు కూడా ఒక్కసా రిగా 0.5 శాతం తగ్గించటంతో ఆశ్చర్యపోయా రు. సమీక్ష సందర్భంగా 0.25 శాతం తగ్గించవచ్చునని ఎక్కువమంది ఊహిం చారు. వారి ఊహలకు భిన్నంగా 0.5 శాతం తగ్గించి రాజన్‌ అందరినీ ఆశ్చర్యపరి చారు. ఇంతకు ముందు బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుకు వడ్డీ (రెపో రేటు) 7.25 శాతంగా ఉంది.

సాహితీవేత్తలపై ఆరోపణలా?:BVR

సమాజ శ్రేయస్సు, లౌకిక విలువల కోసం కృషి చేసే సాహితీవేత్తలకు కేంద్ర మంత్రులు రాజకీయాలు అంటగట్టడం దురదృష్టకరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. 'దేశంలో గొప్ప మేధావులుగా గుర్తించినవారికి పతకాలిచ్చారు. అలాంటి వారి చైతన్యాన్నీ, తెలివితేటల్నీ అవమానించడం సరికాదు' అని ఆయన అన్నారు. విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్న బిజెపి నేతలను ఆక్షేపించకుండా సాహితీవేత్తలపై విమర్శలు చేస్తున్నారని మంత్రులను దుయ్యబట్టారు. 

Pages

Subscribe to RSS - October