October

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరోప్రమాదం

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

245 మండలాల్లో కరువు

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఏడు జిల్లాల్లోని 245 మండలాలను కరువు మండలాలుగా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం జీవో ఎంఎస్‌ నెం.9ను జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకం

కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ కృష్ణా జలాల వివాదాలపై నెలకొల్పిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం వెలువరించిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలకు శరాఘాతం. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపి నాలుగుకు పెరగగా, నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్‌ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని చెప్పారు.

రాజధాని శంకుస్థాపనకు ఏడాది

వ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఒక్కడుగు ముందుకు పడని రాజధానిలో ప్రధానమంత్రి మోడీ ఇచ్చివెళ్లిన మట్టే మిగిలింది.ఏడాదైనా మోడీ తెచ్చిన మట్టీ నీరు తప్ప మిగిలిందేమీ లేదు. ఇంకా భవనాలకు శాశ్వత డిజైన్లు లేకపోవడం విడ్డూరం. వ్యవసాయ కూలీలు, స్థానికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్చలూ చేపట్టడం లేదు. రైతులకు ప్లాట్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతోంది' 

4లక్షల11వేల ఎకరాలను లాక్కుంటున్నారు

రైతుల అంగీకారం లేకుండా భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేయడాన్ని వామపక్షాలు ఎప్పటికీ అంగీకరించవన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోని 59 మండలాల్లో 4 లక్షల 11 వేల ఎకరాలకు పైగా భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు అన్నారు. చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం అమెరికాను అనుసరిస్తోంది..

భారతదేశం కూడా అమెరికా విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్‌ విమర్శించారు. ప్రణాళికా సంఘం(ప్లానింగ్‌ కమిషన్‌) ఎత్తివేతే దీనికి నిదర్శనమన్నారు. అక్టోబర్‌ 14 నుంచి సంగారెడ్డిలో జరగనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల నేపథ్యంలో విలేకర్లతో వారు మాట్లాడారు. అమెరికాలో ప్లానింగ్‌ కమిషన్‌ ఉండదనీ, ఇక్కడ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రణాళిక లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తామనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

Pages

Subscribe to RSS - October