
పుణే : అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై నల్ల పెయింట్‌తో దాడి చేసిన తరహాలోనే మరఠ్వాడాలోని లాతూర్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ జిల్లాకు చెందిన రైట్ టు ఇన్‌ఫర్మేషన్ (ఆర్‌టిఐ) కార్యకర్తపై శుక్రవారం స్థానిక శివసైనికులు దాడిచేసి తీవ్రంగా కొట్టమే కాక, ఆయన ముఖానికి నల్లరంగు పులిమారు. స్థానిక కళాశాల ప్రాంగణంలోని నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న విషయాన్ని బయటపెడతాననడంతో స్థానిక ఆర్‌టిఐ కార్యకర్త మల్లికారున్ భైకత్తిని శివసైనికులు తీవ్రంగా కొట్టి, ఆయన ముఖానికి నల్ల సిరా పూశారు.