వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.