ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే ఎన్నికల వాగ్ధానం మేరకు పేదలకు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు. 296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.