2016

19.78 లక్షల కోట్ల బడ్జెట్..

2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్‌ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంబంధించి 19.78 లక్షల కోట్ల  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

5లక్షలఆదాయం.. పన్ను రాయితీ

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016-17 బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ 2వేల నుండి 5వేలకు పెంచారు. 

ఉత్సవాలు కాదు... కార్యచరణ కావాలి

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఉత్సవాలు కాదు... అభివృద్ధిపై కార్యచరణ కావాలి' అని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం నాటితో రెండో రోజుకు చేరుకుంది. పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, ఎస్కేయూ మీదుగా సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతిచోటా విద్యార్థులు, యువకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రసంగాలు చేసిన అన్ని ప్రధాన కూడళ్లలోనూ జనం ఆసక్తిగా నాయకుల ప్రసంగాలను విన్నారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టినప్పుడు చప్పట్లో తమ మద్దతును తెలియజేశారు.

బిసి సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 

'అనంత' సమస్యలపై నిలదీద్దాం

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి

 రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.

సీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు

రాయలసీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో కొనసాగింది. 

అనంత' సమస్యలపై నిలదీద్దాం

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

పిడికెడుమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమా : సిపిఎం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పు లింగరాజు అధ్యక్షతన వచ్చేనెల 9వ తేదీన విజయవాడలో నిర్వహించే ధర్నాలో పాల్గొని జిల్లా ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు నిరసన తెలియజేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా, సదస్సులో ఏకగ్రీవంగా ఆమోందమైంది.

Pages

Subscribe to RSS - 2016