2016

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు. అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో వివక్షత అధికార టిడిపి వైఖరికి బడ్జెట్‌లో సవరణలు చేయాలి. - సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ 
టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు.
అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో  వివక్షత  అధికార టిడిపి వైఖరికి 
బడ్జెట్‌లో  సవరణలు చేయాలి. -  సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాధ్‌ వ్లెల‌డి

రాయలసీమ సమస్యలపై బస్సుయాత్ర..

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

కెకెలైన్‌తో కూడిన రైల్వే జోన్‌ ప్రకటించాలి- సిపియం

విశాఖకు కెకె లైన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వేజోన్‌పై జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కమిటీల పేర నాన్చుతూ బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. రైల్వేజోన్‌పై జాప్యం ఒడిశా అభ్యంతరాల వల్ల కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు.

'మాన్సాస్‌' భూములు దివీస్‌కు విక్రయంపై న్యాయ విచారణ

మాన్సాస్‌ ట్రస్టు భూములు 99 ఎకరాలు దివీస్‌ లేబొరేటరీకి విక్రయించడంపై న్యాయవిచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దివీస్‌కు తాకట్టుపెట్టిందని విమర్శించారు.

ఢిల్లీలో CPM శిక్షణా పాఠశాల..

ఢిల్లీలోని ఐటీఓ సమీపంలో గల రోజ్‌ఎవెన్యూలో హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవంతికి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం శంకుస్థాపన చేశారు. ఐదంత స్థులతో నిర్మించనున్న ఈ భవంతిలో పార్టీ శిక్షణా పాఠశాలను నెలకొల్ప నున్నారు. కొల్‌కతా ప్లీనం నిర్ణయం మేరకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నారు. మార్చి మొదటి వారంలో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టను న్నారు. ఈ భవంతిలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమందిరం, ఆడిటోరియం, విద్యార్థుల తరగతి గది, నివాస గదులు, వంటశాల నిర్మించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. 

5 రాష్ట్రాల ఎన్నికలకు సిపిఎం సిద్ధం

సీపీఐ(ఎం) 21వ మహాసభ ఆమోదించిన 'రాజకీయ ఎత్తుగడల పంథా' ఆధారంగానే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. బెంగాల్‌లో ప్రజలను ఐక్యపరిచి అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కలిసొచ్చే ప్రజాతంత్రశక్తులతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇక కేరళలో ప్రస్తుత వామపక్ష ప్రజాతంత్ర కూటమితో ఎన్నికల్లోకి వెళ్తామని వెల్లడించారు. 

కన్హయ్య బెయిల్ తిరస్కరణ

 జేఎన్ యూ నేత కన్హయ్య బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు తీర్పు చెప్పడంతో విద్యార్థులు..ఇతరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. న్యాయస్థానాల ఎదుట దాడికి దిగిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మకు గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేశారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కన్హయ్య అరెస్టుపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు రైళ్లను ఆపివేసి తమ నిరసన తెలిపారు. మతతత్వవాదాన్నే కన్హయ్య వ్యతిరేకించారని తేలింది. దీంతో కన్హయను అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.

జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిందే ..

ఆస్తుల కేసులో వైసీసీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ కంపెనీల పెట్టుబడులపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం జగన్‌ సహా 19 మందికి సమన్లు జారీ చేసింది. 

భద్రత పేరిట కుట్ర: CPM

భద్రత పేరిట కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్టణంలో రాజ్ నాథ్ సింగ్ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఎం నేత నర్సింగరావు పేర్కొన్నారు.విశాఖపట్టణం పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని, ఏజెన్సీలోని బాక్సైట్ ను దక్కించుకొనే కుట్ర జరుగుతోందన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, సంఘాలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. దీనితో ఈ ప్రాంతంలో పారామిలటరీ సైన్యాన్ని దింపడానికి వ్యూహరచన చేశారని విమర్శించారు.

Pages

Subscribe to RSS - 2016