District News

గుంటూరు, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధ్ది చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. రెండు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయించడంతో ఈ రెండు ఆసుపత్రులకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు రోజూ సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని మధు పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్ల కోసం 670 పడకలు మంజూరైనా, 412 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి మరో 80 పడకలు అవసరమవుతాయన్నారు. మొత్తం 750 పడకల రోగులకు వైద్య సేవలు సరిగా అందాలంటే అందుకు అవసరమైన...

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన స్మార్ట్‌ సీటీల నామినేషన్‌ జాబితాలో విజయవాడకు చోటు లభించింది. వివిధ రాష్ట్రాల రాజధానులు లక్నో, ముంబయి, గాంధీనగర్‌, జైపూర్‌, భువనేశ్వర్‌, రారుపూర్‌, గౌహతిలతోబాటు విజయవాడ కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 100 స్మార్ట్‌ సిటీలకు నామినేట్‌ అయిన వాటిలో పాట్నా, కోల్‌కతా, బెంగుళూరులకు చోటు దక్కలేదు. ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులో చేరాయి. తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరాలు, మునిసిపాలిటీలను -బీహార్‌లోని బీహార్‌ షరీఫ్‌, ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, సహరాన్‌పూర్‌లు, హిమాచల్‌లోని ధరమ్‌శాల, కర్ణాటకలోని శివమొగ్గలను- రాష్ట్రాలు నామినేట్‌ చేశాయి. ఎంపిక ప్రమాణాల ప్రకారం పెద్ద పెద్ద నగరాలకు ఈ జాబితాలో...

కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియా కీలకమైన ప్రజాసమస్యలను విస్మరిస్తోందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ప్రజాశక్తి 35వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 'వర్తమాన పరిస్థితులు-మీడియా' అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కార్పొ రట్లకు, రాజకీయనేతలకు మధ్య అపవిత్ర పొత్తు నెల కొందని, అదే పరిస్థితి మీడియా రంగానికి వ్యాపించిందని చెప్పారు. వ్యాపారస్తులే మంత్రులుగా మారుతున్నారని, మీడియా సంస్థలనూ ఏర్పాట చేస్తున్నారని చెప్పారు. ఫలితంగా సొంత లాభం కోసం దేశ ప్రయోజనాలను తుంగలో...

రాజమండ్రి దుర్ఘటనలో ప్రభుత్వ విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా గతనెల 14న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రైల్‌ వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. తొక్కి సలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని... దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసులు చేపట్టిన రహస్య విచారణ తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది...

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి. ఎట్టకేలకు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వర్సిటీకి సెలవులు ఇచ్చి, విద్యార్థులు లేనపుడు...

పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓవైపు పేదల భూములను లాక్కుంటూ మరోవైపు సముద్ర తీరాల్లో విదేశీ సంస్థలతో ఫ్యాక్టరీలు...

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీభూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని...

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. విశాఖలో 2,500 మందినీ, రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద మరో వెయ్యి మందినీ అరెస్టు చేశారు. 

Pages