District News

ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కూడా దోహదం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ లెనిన్‌ సెంటరు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌, పూర్తి స్థాయిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు రాలేదన్నారు.

 చేతివృత్తిదార్లకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయ వాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన చేతివృత్తిదారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్‌ రంగంలో బిసిలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాం డ్‌ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బిసిలకిచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిం చారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచర ణకు నోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్నివర్గాల ప్రజలనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల్లో సామాజిక న్యాయం లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, ఉన్న ఉద్యోగాలకు భద్రత సన్నగిల్లుతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవన్‌లో బుధవారం కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈనెల 28న గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని...

పారిశ్రామిక అభివృద్ధికే భూసమీకరణ అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టును అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున భూములు లాక్కొంటోందన్నారు. అక్కడ వేలాది ఎకరాలను దశాబ్దాల తరబడి స్థానికులు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూదందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టిడిపి, కారగ్రెస్‌ నేతలపై జరిగిన తిరుగుబాటే దీనిని నిదర్శనమన్నారు. ప్రభుత్వం బేషరతుగా భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టపరిహారం...

అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్‌ ప్రాంతమైన భవానీఘాట్‌ నుండి పున్నమి హాోటల్‌ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్‌ పట్టాలు కూడా...

బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న పోర్టు నిర్మాణ పనులకు రాత్రికిరాత్రే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసి గ్రామాల్లో అలజడి సృష్టించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించవచ్చన్న టిడిపి నాయకులు, ఇప్పుడు 30 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేశారో చెప్పాలని ప్రశ్నించారు. భూములివ్వకపోతే పోర్టు నిర్మాణం జరగదని బెదిరింపులకు దిగడం బాధాకరమన్నారు.పోర్టు పేరుతో 30 వేల ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.ల్యాండ్‌పూలింగ్‌...

 బందరు పోర్టు భూముల ప్రభావిత గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విస్తృతంగా పర్యటించారు.భూ బ్యాంక్‌ పేరుతో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బందరు తీరంలో 30 వేల ఎకరాలు సమీకరిస్తోందని, ఇందులో 14 వేల ఎకరాల ప్రైవేటు భూములున్నట్లు చెబుతూ మిగిలిన 16 వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్న రైతులకు మొండిచెయ్యి చూపించేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. సాగుదారులకు అండగా ఉంటామని, పోరాటం చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములు సహా మొత్తం 15 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచలేదన్నారు. ఈ విధానాలు సామాన్య ప్రజల సంక్షేమానికి చేటు తెస్తాయని, తమ పార్టీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. 

Pages