District News

విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. 

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు. చిన్నతనం నుంచి తమకు నచ్చిన పుస్తకాలను చదవనిస్తే, పిల్లలకు పుస్తక పఠనం అల వాటుగా మారుతుందని చెప్పారు. పాఠకుల సంఖ్య ఎప్పటికప్పుడు...

ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్‌, ఆఫీసు స్టాఫ్‌ స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ ఉద్యోగులకు జీతా లు...

రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు విమర్శించారు.  రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక అనంతరం నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పిన ప్రభుత్వం నేరుగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలను భాగస్వామ్య పద్ధతిలో...

తెలంగాణలో చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు.

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ, పద్యరచన, కవితా రచనల ద్వారా జాషువా...

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ "భూబ్యాంక్ బండారం..కార్పోరేట్లకు పందేరం" అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమక్ష్యంలో విడుదలచేసారు.

అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూ దందా నిర్వహిస్తోందని, ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన వేల ఎకరాలు భూములు ప్రయివేటు వ్యక్తులకు, విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. స్థానిక టీచర్స్‌ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ హాల్లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిపిఎం డివిజన్‌ సెక్రటేరియట్‌ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతురావు అధ్యక్షత వహించారు. ఇందులో పలువురు మేధావులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు క్రీడా కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు దీనిపై మాట్లాడారు. రాజధాని నిర్మించే 29 గ్రామాల్లో ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని...

రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్‌ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు విమర్శించారు.విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్‌డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. గ్రీన్‌ బెల్డ్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు. సిఆర్‌డిఏ పరిధిలోని 16 లక్షల ఎకరాలల్లో 2050 వరకు ఇళ్ల...

ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, భూ బ్యాంక్‌ పేరుతో ప్రతి జిల్లాలోనూ లక్షలాది ఎకరాలు సేకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగు లేస్తుండడంతో బాధితులందరినీ కూడగట్టడానికి వామ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. మంగినపూడిలో కొందరు భూస్వాములను...

Pages