చరిత్రలో సిపిఎం - 3 తన సొంత విధానాన్ని రూపొందించుకున్న సిపిఎం సిద్ధాంతం విషయంలో ఎటువంటి రాజీ పడకుండా సాగుతోంది. ఎత్తుగడల విషయంలో మాత్రం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కార్మిక, కర్షక, కష్టజీవుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళుతూ వస్తున్నది. అందువల్లనే బెంగాల్‌లో రెండవ యునైటెడ్‌ఫ్రంట్‌లో ఇతరులకన్నా అసెంబ్లీ స్థానాలు తనకే ఎక్కువ వచ్చినప్పటికీ ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని బంగ్లా కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.
బెంగాల్, కేరళ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో రైతాంగం, ఇతర కష్టజీవుల వర్గ చైతన్యాన్ని పెంచేందుకు సిపిఎం బ్రహ్మాండంగా కృషి చేసింది. భూమి సమస్యపైనా, ఇంకా ఇతర సమస్యలపైనా గ్రామీణ...
District News
చరిత్రలో సిపిఎం 2 రివిజనిజంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎం- బర్ద్వాన్ ప్లీనంలో అతివాద పెడ ధోరణి నుంచి కూడా స్పష్టంగా వేరుపడింది. అటు రష్యా మార్గం, ఇటు చైనా మార్గం అని కాక భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న స్వతంత్ర పంథాలో ముందుకు సాగింది. దేశవ్యాపితంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించింది. సిపిఎం పంథా సరైందని ప్రజలు నిరూపించారు. కేరళ, బెంగాల్, త్రిపురలో కూడా అధిక సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులను ఎన్నుకొన్నారు.
సిపిఎం ఏడవ మహాసభలో కార్యక్రమాన్ని, ఇతర డాక్యుమెంట్లను ఆమోదించినప్పటికీ సిద్ధాంత సమస్యలపై సమగ్ర చర్చను వాయిదా వేసింది. సిద్ధాంత సమస్యలపైనా, అంతర్జాతీయ కమ్యూనిస్టు...
విద్యుత్ చార్జీల భారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యులే. ఇందులో ప్రధాన ముద్దాయి కేంద్రం, మోడీ ప్రభుత్వం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలను ప్రజలు తిప్పికొట్టారు. అదే సంస్కరణలు నేడు కేంద్ర ప్రభుత్వం తన విధానాల పేరుతో అమలు చేస్తోంది. కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కేంద్ర విద్యుత్ చట్ట సవరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రస్తుతానికి చట్ట సవరణ చేయకపోయినా అనేక రూపాలలో ఆ ప్రమాదకరమైన విధానాల అమలుకు పూనుకుంటున్నాయి. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని ఉగాది కానుకగా ఇచ్చింది. రూ. 4300 కోట్లకు పైగా...
ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థ వైఖరి పాటించడం సరైంది కాదంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా బెదిరింపులకు దిగుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తే 'తీవ్ర పర్యవసానాలు' ఎదుర్కోవాల్సి వుంటుందంటూ అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల జాతీయ డిప్యూటీ సలహాదారు హుకుం జారీ చేయడం గర్హనీయం. భారత్‌లో పర్యటనకు వచ్చి ప్రభుత్వానికి ఈ విధంగా బెదిరించడం ఎంతమాత్రం అనుమతించరానిది. అదే సమయంలో భారత్ సందర్శనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ ఏం కోరితే అది ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తాన్ని అందించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అగ్ర రాజ్యం ఎంత...
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపింది. కరోనా విలయానికి జనం బతుకులు కకావికలమైన సమయాన ఇళ్లకు వాడే కరెంట్ బిల్లులు పెంచి షాక్ ఇవ్వడం సర్కారు కర్కశానికి తార్కాణం. ఇప్పటికే కేంద్రం గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తుండగా దానికి విద్యుత్ ఛార్జీల భారం అదనం. గృహ వినియోగదారులపై పడే మొత్తం భారం రూ.4,300 కోట్లు. అందులో టారిఫ్ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్ వసూళ్లు రూ.2,900 కోట్లు. ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ (ఎపిఇఆర్‌సి)నే ఛార్జీలు వడ్డిస్తూ నిర్ణయం వెలువరించినా, ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడం వల్లనే ఛార్జీలు పెరిగాయి. మూడు డిస్కంలు...
చరిత్రలో సిపిఎం-1
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడదీసి చూడలేం. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ, అక్టోబరు విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్ తిరిగివచ్చినవారూ, ఖిలాఫత్, హిజ్రత్ ఉద్యమాలపై అక్టోబరు విప్లవప్రభావంవల్ల కమ్యూనిస్టులైనవారూ, గదర్ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారినవారూ, భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్ వారూ - ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు...
రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో రోడ్డెక్కారు. ఇంత పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడం, వివిధ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వారు భాగస్వాములు కావడం, అనేక రాష్ట్రాల్లో బంద్ వాతావరణం నెలకొనడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. కార్మికవర్గ ప్రతిఘటన కారణంగా సంస్కరణల అమలు విషయంలో భారత్‌లో అయోమయ వాతావరణం నెలకొందన్న అర్ధం వచ్చే శీర్షికతో '...