District News

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్‌ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920) ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు జీవించే హక్కును, మానవ హక్కులను మంటగలిపేదిగా ఉందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినా...

జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం,
     అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు...

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి...దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసకబార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసి తీవ్రమైన అబద్ధాలు వల్లించారు. అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు. ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడి ఇనుప గనులు కేటాయించడం. దేశంలో సొంత ముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ...

సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు.విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం...

Pages