District News

 రో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుంది. కర్త, కర్మ, క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్‌ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్‌ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారు. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదు. ఒక పథకం ప్రకారం హిందీని రుద్దే చర్యలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం....

బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరు. సొంత బలాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యం. రాజకీయ, సామాజిక శక్తులను ఏకం చేసేందుకు కృషి - మీడియా గోష్టిలో సీతారామ్‌ ఏచూరి. కన్నూర్‌ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు తాము శక్తివంచనలేకుండా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. దీనికి ముందు పార్టీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం పట్ల నిబద్ధతను మహాసభ పునరుద్ఘాటించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామని, తద్వారా బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ కూటమి సవాల్‌ను తిప్పికొడతామన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందూత్వ ఎజెండాను ఓడించే...

1. సీతారాం ఏచూరి
2. ప్రకాశ్‌ కరత్‌
3. మాణిక్‌ సర్కార్‌
4. పినరయి విజయన్‌
5. బి.వి రాఘవులు
6. బందాకరత్‌ (మహిళ)
7. కొడియేరి బాలకష్ణన్‌
8. ఎం.ఎ బేబి
9. సూర్యకాంత మిశ్రా
10. మహమ్మద్‌ సలీం
11. సుభాషిణి అలీ (మహిళ)
12. జి.రామకష్ణన్‌
13. తపన్‌సేన్‌
14. నీలోత్పల్‌ బసు
15. వి.శ్రీనివాసరావు
16. ఎం.ఎ.గఫూర్‌
17. సుప్రకాశ్‌ తాలూక్దార్‌
18. ఇప్ఫాకర్‌ రెహ్మాన్‌ (కొత్త)
19. లాలన్‌ చౌదరి (కొత్త)
20. అవదేశ్‌ కుమార్‌
21. కె.ఎం. తివారి
22. అరుణ్‌ మెహతా
23, సురేందర్‌ మాలిక్‌
24. ఓంకార్‌ షాద్‌
25, మహమ్మద్‌ యూసఫ్‌...

'సత్యం కోసం పోరాడటానికి కమ్యూనిస్టు ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుండాలి. ఎందుకంటే, సత్యం ప్రజల ప్రయోజనాల కనుగుణమైనది. కమ్యూనిస్టు తమ తప్పులను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలి. ఎందుకంటే, తప్పులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి' అంటాడు మావో. అంతేకాదు... 'ప్రజలు భూమిలాంటివారు. కమ్యూనిస్టులమైన మనం విత్తనాల లాంటివారం. మనం ఎక్కడకు వెళ్లినా, మనం ప్రజలతో ఐక్యమవ్వాలి. ప్రజల్లో వేరూని, పెరిగి...వారి మధ్యనే వికసించాలి' అంటాడు. ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కమ్యూనిస్టులు పార్టీకి, జనసామాన్యానికి మధ్య సంబంధాలను దృఢపరచడంలో ముందుంటారు. ప్రజలకు స్నేహితుడుగా, ఉపాధ్యాయుడుగా ప్రజలతో ఐక్యమవుతాడు. ఈ క్రమంలో జరిగే మంచి చెడులను చర్చించుకొని ఆచరణ యుక్తంగా,...

ర్ణాటకలో ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలపై అనవసర రగడను సంఫ్‌ు పరివార శక్తులు తెర మీదికి తెస్తున్నాయి. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్‌ చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారలేదు. తాజాగా హలాల్‌, అజాన్‌, పండ్ల అమ్మకం వంటి అంశాలు వరస కట్టాయి. మతోన్మాదం ఆధారంగా లబ్ధి పొందాలని చూస్తున్న కాషాయ రాజకీయ శక్తులు ఈ ఉన్మత్త, ఉద్వేగపూరిత ఎజెండాను దురుద్దేశపూర్వకంగా ప్రజల్లో జొనుపుతున్నాయి. ప్రజలు ఈ కుట్రను, కుతంత్రాన్ని గ్రహించి, విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. విద్య, వైద్యం, కనీస వసతులు, ధరలు, ఉపాధి వంటి అంశాలు ప్రజల రోజువారీ జీవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి తలెత్తే సమస్యలు ప్రజలను ఏకం చేస్తాయి....

Pages