District News

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణలో సరికొత్త ముందడుగు. స్థూలంగా సర్కారు చర్య స్వాగతించదగింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ కాస్తా 26 జిల్లాలుగా సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపంతో సోమవారం నుండి ఉనికిలోకొచ్చింది. కొత్తగా 13 జిల్లాలు రాగా, రెవెన్యూ డివిజన్లు 51 నుండి 72కు పెరిగాయి. జిల్లాల విభజనపై జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేయగా ప్రజల నుండి 16 వేలకు పైన సూచనలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. వాటిలో సహేతుకమైనవాటిని ఆమోదించామంటున్నారు. పాడేరు కేంద్రంగా నెలకొల్పిన అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల నిర్ణయంలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. పోలవరం...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే ఎడమ కాలవ ద్వారా విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు వస్తాయి. ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలకు మళ్ళించేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం పూర్తి కావడం ఇక్కడ కీలకం. దాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఇది విభజన చట్టం నిర్దేశించిన విషయమే. ఆ పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిగబట్టినది ఎవరు? బిజెపి ప్రభుత్వం కాదా? లక్షలాది నిర్వాసితులను నీట ముంచుతూ వారి పునరావాసం తన బాధ్యత కానే కాదంటున్నది ఎవరు? బిజెపి కాదా? పోలవరం పూర్తి కాకుండా మోకాలడ్డుతూ, అక్కడ గిరిజనులను నీట ముంచుతూ ఇక్కడ ఉత్తరాంధ్రలో జలం కోసం యాత్ర అని ఘోష పెట్టడం ఎంత పెద్ద డ్రామా! విశాఖ...

నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా...అదే సమయంలో...హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సాగే రాజకీయ సైద్ధాతిక పోరాటాల సమ్మేళనంగానే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనపై సాగే పోరాటం వుండాలని సిపిఎం ఎప్పుడూ చెబుతూ వస్తుంది. హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదం, అందులో అంతర్లీనంగా ముస్లిం వ్యతిరేకత అనేది ప్రజల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజల్లో గణనీయ వర్గాలను ప్రభావితం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి వుంది. హిందూత్వకు రాజకీయ-సైద్ధాంతిక ప్రతివాదాన్ని నిర్మించి, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళని పక్షంలో హిందూత్వ-కార్పొరేట్‌ వర్గాల పాలనను దీటుగా, సమర్ధవంతంగా సవాలు చేయలేం.
సిపిఎం 23వ మహాసభ ఏప్రిల్‌ 6 నుండి 10 వరకు కేరళ లోని...

చరిత్రలో సిపిఎం - 5 దేశంలోని భిన్నత్వాన్ని, సామరస్యాన్ని దెబ్బ తీసే మతోన్మాద శక్తుల ఎదుగుదలపై సిపిఎం మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంది. జనసంఫ్‌ు కాలం నుంచీ ఆ పార్టీ దూరంగా ఉంటూ, దానిని ఒంటరిపాటు చేయటానికీ అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నించింది. అవకాశవాదంతో కొన్ని ప్రాంతీయ పార్టీలు దాని పంచన చేరుతున్నప్పుడు, కాంగ్రెస్‌ పలు కీలక సందర్భాల్లో దాని పట్ల ఉదారంగా వ్యవహరించినప్పుడు తీవ్రంగా హెచ్చరించింది. బిజెపి ఎదుగుదల దేశానికి ప్రమాదమని 11వ మహాసభ నుంచి చేస్తున్న తీర్మానాలు ఇప్పుడు అది ఎంత నిజమో స్పష్టమవుతోంది.
1987 అక్టోబర్‌ 12న మతోన్మాదానికి, వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా సిపిఎం ఢిల్లీలో సదస్సు నిర్వహించింది. చీలికలు, పీలికలుగా...

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ రాజధాని వివాదాన్ని ఇంకా కొనసాగించే ఉద్దేశాన్ని సూచిస్తోంది. రాజధానిలో, రాజధాని ప్రాంతంలో ప్రధాన మౌలిక పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు మూడు మాసాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను స్వాధీనం చేయాలని, ఆర్నెల్లలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అమరావతిపై వ్యాజ్యాలలో మార్చి 3న హైకోర్టు తీర్పు వెలువరించింది. దానిపై నెల రోజులకు సర్కారు స్పందించి పనులన్నీ పూర్తి చేయడానికి ఐదేళ్లు కావాలని గడువు కోరింది. కాగా ఐదేళ్ల గడువు అడగడానికి స్పష్టమైన ప్రాతిపదిక, హేతువులేమీ తెలపక పోవడంతో కాలయాపన కోసం, కోర్టు ఆదేశాల అమలు నుండి...

Pages