కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవంలోని హోటల్ రివర్‌బేలో బుధవారం రాష్ట్ర స్థాయి నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు.