December

ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను ప్రవేశపెడితే సహించం - సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు

                        ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం.

ప్రత్యక్ష ఎన్నికలుజరపాలి:జేసి

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏకవ్యక్తి పాలనలు నడుస్తున్నాయని, రాజకీయ విలువలు ఎక్కడా పాటించడం లేదని, తక్షణమే ప్రత్యక్ష ఎన్నికలు జరిపి పాలన సాగిస్తే బాగుంటుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో కుక్కల్లా కొట్లాడుతూ... అసెంబ్లీలో కాకుల్లా అరుస్తూ... ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.

దాద్రీ ఘటనలో కొత్త కోణం ..

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రీ సంఘటనలో మృతుడు అఖ్లాఖ్‌(52) నివాసంలో లభించింది ఆవు మాంసం కాదని, అది మేక మాంసమని అధికారులు నిర్ధారించారు. అఖ్లాఖ్‌ ఆవు మాంసం తిన్నాడనే ఆగ్రహంతో ఒక గుంపు సెప్టెంబర్‌ 28న అతడిని హతమార్చిన విషయం విదితమే.ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పశువైద్యశాఖాధికారులు దానిని పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు.అక్కడ అది మాంసం కాదని, మేక మాంసమని నిర్ధారించారు. దీనిపై మృతుడి భారత వాయుసేన ఉద్యోగి సర్తాజ్‌ మాట్లాడుతూ రాజకీయ కారణాలతోనే తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు. 

జనవరి నుంచి గ్యాస్ సబ్సిడీ కట్

ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది. 

నూతన పార్లమెంట్ నిర్మించాలట..

నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని లోక్‌సభ స్పీకరు సుమిత్రా మహజన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుత పార్లమెంటు ఆవరణలో కానీ, లేదా రాజ్‌పథ్‌ మార్గానికి ఆనుకుని ఢిల్లీ పోలీసు భద్రతా కార్యాలయమున్న ప్రాంతంలోగానీ నిర్మించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో స్పీకర్‌ పేర్కొన్నారు. లక్నోలో నిర్వహించిన భారత్‌ శాసనసభాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ 1927లో అప్పటి అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన 88 ఏళ్ల నాటి ఈ భవనం సభావ్యవహారాలకు ఇక ఎంతమాత్రమూ సరిపోదని తెలియజేశారు.

జైట్లీ కాకపోతే దెయ్యాలు చేశాయ?

డీడీసీఏలో చోటు చేసుకున్న అవినీతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నియమించిన దర్యాప్తు కమిషన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు బీజేపీ పేర్కొన్నడాన్ని ఆప్‌ తప్పుపట్టింది. డీడీసీఏ అవినీతిపై ఆప్‌ నియమించిన సొంత విచారణ కమిటీనే తన నివేదికలో జైట్లీ పేరును ప్రస్తావించకపోవడంతో కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేయగా, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ దానిని తోసిపుచ్చారు.'జైట్లీ డీడీసీఏ అధిపతిగా ఉన్న కాలంలో అవినీతి జరిగింది. ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇస్తే మరి అవినీతి ఎవరు చేసినట్టు? దయ్యాలు చేశాయా?' అంటూ ప్రశ్నించారు. 

సోనియా తండ్రి ఓ ఫాసిస్ట్..!

'కాంగ్రెస్ దర్శన్' ఇది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధికార పత్రిక, హిందీలో ప్రచురితమయ్యే ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు ఇపుడు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏకంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్‌ చేస్తూ రాసిన ఆర్టికల్స్ పార్టీలో కలకలం రేపింది. సోనియా గాంధీ ముఖచిత్రంతో వెలువడ్డ కాంగ్రెస్‌ దర్శన్ డిసెంబర్‌ సంచికలోని ఓ వ్యాసంలో ఆమె జీవితాన్ని ప్రస్తావించారు. సోనియా తండ్రి ఇటలీ ముస్సోలిని సేనానిగా పనిచేశారని, అతనో ఫాసిస్టని పేర్కొంది..

CPM,CONG పొత్తు ఊహాగానాలే

పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లీనంలో చర్చించలేదని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుందని, దానికి కేంద్ర కమిటీ ఆమోదం తప్పనిసరని చెప్పారు. అయితే బెంగాల్‌ రాష్ట్ర కమిటీ కాంగ్రెస్‌తో పొత్తుకు అనుకూలంగా ఉందన్న మీడియా ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. 'ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైతే' అన్న విలేకరుల ప్రశ్నకు.. సీపీఎంలో 'ఒకవేళ' అన్న ప్రశ్న ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు..

రాందేవ్‌ ఉపన్యాసం మాకొద్దు..

న్యూఢిల్లీ : జేఎన్‌యూలో వేదాంతపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు యోగా గురు బాబా రాందేవ్‌కు ఆహ్వానం పంపడంపై ఆ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకోవాలని లేకుంటే, నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

రామోజీ ఓం సిటీకి వెయ్యి ఎకరాలు

‘ఓం సిటీ’కి తెలంగాణ సర్కారు వెయ్యి ఎకరాల భూమి కేటాయించబోతోంది. ఇందులో ఐదు వందల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి కాగా..మిగిలిన మొత్తం సేకరించి ఇవ్వనుంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కొద్ది కాలం క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశం అయి..ఓం సిటీ ప్రాజెక్టు గురించి వివరించటంతోపాటు..ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై సీఎం కెసీఆర్ కూడా సానుకూలంగా స్పందించటంతో పాటు..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Pages

Subscribe to RSS - December