కరోనా మహమ్మారిపై జాతి యావత్తూ ఒక్కటై పోరాడుతున్న వేళ దానిని బలహీనపరిచేలా కొన్ని స్వార్థపర శక్తులు యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శతాబ్దం లోనే అతి భయంకరమైన శత్రువుతో ప్రపంచం పోరాడుతోంది. మన దేశంలో దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మత పరంగా సమాజంలో చీలికలకు ఆస్కారమిచ్చేలా వ్యవహరించడం శోచనీయం. కరోనాకు మతం రంగు పులిమేందుకు సోషల్ మీడియా లోను, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా సాగుతున్న గోబెల్స్ ప్రచారానికి, అధికారంలో ఉన్న పెద్దలకు సంబంధం లేదని అనుకోలేము. కరోనాపై పోరు ప్రకటించిన సమయంలో ఢిల్లీలో వందలాది మందితో సమావేశం ఏర్పాటు చేయడం 'తబ్లిఘీ జమాత్' నిర్వాహకుల బాధ్యతారాహిత్యమే. కరోనా...
District News
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ ప్రభావం తూర్పు గోదావరి లోని సుమారు 1.50 లక్షల మంది ట్రాన్స్పోర్టు రంగ కార్మికులపై తీవ్రంగా పడింది. అత్యవసర సరకుల రవాణా మినహా మిగిలిన సరకుల రవాణా నిల్చిపోవడంతో లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభం, ఇటీవల వరకు ఎదుర్కొన్న ఇసుక కొరత వల్ల ఇప్పటికే రవాణా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి లాక్డౌన్ కూడా తోడు కావడంతో ట్రాన్స్పోర్టు రంగ కార్మికులు, ట్రాన్స్పోర్టు వాహనాల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో పది టన్నుల కెపాసిటీగల టిప్పర్, క్వారీ లారీలు 6,500 వున్నాయి. 20...
దేశం యావత్తూ లాక్డౌన్లో ఉంది. కాని వేల సంఖ్యలో వలస కూలీలు ప్రతి పట్టణం లోనూ బస్స్టాండ్లలో కిక్కిరిసి పోయారు. లేదా రోడ్ల మీద ఉన్నారు. ఇక లాక్డౌన్కి అర్థం ఏంటి? ఈ మహమ్మారి వ్యాపించకూడదన్న లక్ష్యంతోనే లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాంతరవాసానికి బయలుదేరి ఇంతవరకూ ఈ మహమ్మారి సోకని పల్లె ప్రాంతాలకు పోతున్నారు. అక్కడేమో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. వైరస్ వ్యాప్తి కారణంగా మానవ జీవితాలు విషాదం కాకూడదని లాక్డౌన్ విధిస్తే...అంతకన్న తీవ్రమైన మానవ విషాదం ఇప్పుడు కళ్లెదుట కనపడుతోంది!కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి లాక్డౌన్ ప్రకటించారు. సరైన ప్రణాళిక లేకుండా, ముందస్తుగా తగిన సన్నాహాలు చేయకుండా ఇటువంటి...
కరోనా వైరస్ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్డౌన్ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్డౌన్ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్డౌన్తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్డౌన్ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది. అలాగే కొండ చీపుళ్లు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలకు పెద్ద...
కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్త లాక్డౌన్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని పూర్తిగా విస్మరించింది. సర్కారు నిర్లక్ష్య పర్యవసానాలు వ్యవసాయ రంగాన్ని, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోగా కర్షకులు ఆత్మహత్యలబాట పట్టారు. ఆర్థిక మాంద్యం తోడైన ఫలితంగా పరిస్థితి మరింతగా దిగజారింది. సరిగ్గా ఇప్పుడే కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం వెనకాముందు చూడకుండా విధించిన సుదీర్ఘ లాక్డౌన్, కునారిల్లుతున్న వ్యవసాయ రంగంపై పిడుగుపాటైంది. లాక్డౌన్ను అమలు చేస్తున్న కేంద్రం, దాని వలన నష్టపోయే కొన్ని వర్గాల...
కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్ ఆల్లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రకటనలు వీడియో మీడియా...
ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. సమాజం ఎదుర్కొనే ఏ సంక్షోభమైనా-అది ఆర్థికమైనా లేక సామాజికమైనా-ప్రభుత్వ విధానాల ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఫైనాన్స్ పెట్టుబడి- కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, కోటీశ్వరుల-ప్రయోజనాలను పరిరక్షించేదిగానే వుంటుందే తప్ప కార్మికుల...