District News

గ్గయ్యపేటరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సోమోజు నాగమణి విమర్శించారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డులో  ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను  సిపిఎం డివిజన్‌ నాయకులు ఘంటా నాంచారయ్య ప్రారంభించారు. ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ జాన్‌పాషా ముగించారు. సిపిఎం డివిజన్‌ నాయకులు కాకనబోయిన లింగారావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్‌, రామకృష్ణ, షేక్‌ గౌస్‌మియా, ప్రణయ తేజ, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శ్వేతపత్రం, చర్చల పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకు కుట్ర 
-  ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి
                   శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్‌ తవ్వకాలు అక్రమమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మధు బుధవారం ఒక లేఖాస్త్రాన్ని స...

దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పది వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించింది. గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలపాలని నాయకులు నిర్ణయించారు. జర్రెల ప్రాంతానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వెళ్ళి బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తొలగించడానికి నిరసనగా గ్రామాల్లో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పర్యటించాలని నిర్ణయించారు.

శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్‌ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. విదేశానికి చెందిన రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ కోసమే ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించిందని విమర్శించారు. దేశీయ కంపెనీతో కలిసి రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ నష్టాలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిఎం చంద్రబాబుకు ప్రజా సంక్షేమం కంటే పెన్నా, రస్‌ ఆల్‌ ఖైమా కంపెనీల మనుగడే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.  ప్రత...

భూదాహం వద్దు
దిష్టిబొమ్మ దహనంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు భూములను కట్టబెడుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పైకిచెబుతున్నా, లోపల మాత్రం ప్రజల నుండి ఏవిధంగా భూములు లాక్కోవాలో అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతోందన్నారు. మచిలీపట్నం భూపోరాటంపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం ఉదయం 'భూముల్ని తినే తోడేలు' దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైన మేరకే భూముల...

ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్‌ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 30తో గడువు ముగిసినా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 41 శాతం మేర విద్యుత్‌ ఆదా చేసేందుకు 2014 ఆగస్టు 14వ తేదీ వరకూ వీధిలైట్ల నిర్వహణ రియల్‌ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుందని, కానీ ఆ రీతిలో విద్యుత్‌ ఆదా చేయలేదని తెలిపారు. అయినా 2007 నుండి...

బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్‌ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్‌ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్‌ లభించింది.

బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్‌ నుండి నవకళ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన న...

ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడేంత స్థాయి తనకు లేదని, అక్కడున్న ఎంపిలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఆ పని చేయాల్సి ఉంటుందని జనసేన అధినేత వపన్‌ కళ్యాణ్‌ అన్నారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 

దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

Pages