District News

వామపక్ష, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ప్రత్యక్ష భూ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని సంఘాలతో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి భూ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ దాసరి భవన్‌లో వామ పక్ష రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని ఖండించారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్‌, ప్రభుత్వ భూములకు అన్ని హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం,...

సంఘటితంగా ఉద్య మించి ఇళ్ల పట్టాలు, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం సాధించుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న గూడును కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు కృష్ణాకరకట్ట నివాసుల పరిరక్షణకై రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామలింగేశ్వర్‌నగర్‌లోని తారకరామా నగర్‌, ఇతర ప్రాంతాల్లో సోమవారం పాదయాత్ర చేశారు. బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో కృష్ణాకరకట్ట పరివాహక ప్రాంత పరిధిలోని 8.5 కిలోమీటర్ల పరిధిలో పేదలు నివాసాలుండే గృహాలను తొలగించాలన్న ప్రభుత్వం యోచనను అందరూ సంఘటితంగా తిప్పికొట్టాలని కోరారు. ఇప్పటికే భవానీపురం ప్రాంతనివాసులకు కార్పొరేషన్‌ అధికారులు...

విజయవాడ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చిన ప్రాథమిక విద్యనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య కోసం అదనంగా రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ( ఎన్‌సిఇఆర్‌టి ) చెప్పినా, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తితో కాకుండా, వ్యాపార దృష్టితో విద్యను అందిస్తోందన్నారు. మహిళలను వ్యక్తిగత ఆస్తిగా చూడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి పరిష్కారాలకై...

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమండిలో పేదల భూముల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులతో పాటు రైతులను అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘుతో పాటు 60 మంది నేతలను అదుపులోకి తీసుకుని నాగాయలంక పీఎస్ కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి  చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్య దర్శి అండ్య మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ప్రయి వేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ శాంతినగర్లో సోమవారం కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు పూర్తిగా విస్మరించా యని విమర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర...

భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద ఎత్తున్న బలగాలను దించి రైతులను భయబ్రాంతులను గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లక్షలాది ఎకరాలు తీసుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ఖండించాలని మధు పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. 

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు. చిన్నతనం నుంచి తమకు నచ్చిన పుస్తకాలను చదవనిస్తే, పిల్లలకు పుస్తక పఠనం అల వాటుగా మారుతుందని చెప్పారు. పాఠకుల సంఖ్య ఎప్పటికప్పుడు...

Pages