District News

ఉల్లి, కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. వీటి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం రాస్తారోకోలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు  పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు, కందిపప్పు ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని, వాటిని అదుపుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతు బజార్లలో ఉల్లి రూ.20 చొప్పున అమ్మకాన్ని నామ మాత్రం గానే ప్రారంభించారని, వీటికోసం భారీ క్యూలు ఉంటున్నాయని కొందరు మహిళలు సొమ్మసిల్లిపోతు న్నారని వెల్లడించారు. ఈ ఘటనలు మీడియాలో వస్తున్నా సరుకు సరఫరాలకు చర్యలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా...

నారాయణ కళాశాల విద్యార్థినుల మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఐద్వా, విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఐద్వా, డివైఎఫ్‌ఐలు బుధవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినులవి ఆత్మహత్యలే ఐతే, అందుకు కారణాలేమిటో కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, విశ్రాంతిలేని చదువులే వారి చావులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖాకీల ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు ఆందోళనను ప్రారంభించారు. భూసేకరణ...

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు సమావేశమై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ, భూసేకరణను వ్యతిరేకిస్తూ నేడు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద రాజధాని గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులతో రాస్తారోకో నిర్వహించారు.  ఈనెల 24న రాజధాని గ్రామాల్లోని క్రిడా కార్యాలయాలను ముట్టడించాలని, 25న రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు..

 

రాజధాని పరిధిలో భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి. మధు అన్నారు. అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూసమీ కరణకు భూమి ఇవ్వకుండా ఉన్న రైతుల నుంచి భూమిని తీసుకోవడానికి రాష్ట్ర పభ్రుత్వం భూసే కరణ నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. దీనికి నిరస నగా ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్నారు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం నాయకులు సిహెచ్‌. బాబూరావు, జె. శివ శంకర్‌, రవి, నవీన్‌ వైకాపా నాయకులు శ్రీని వాస్‌రె డ్డితో పాటు...

రాజధాని కోసమే భూ సేకరణ చేస్తున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని సిపిఎం క్రిడా ప్రాంత కమి టీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు గురువారం విలేకరుల సమా వేశంలో విమర్శించారు. రైతుల భూములను లాక్కొని సింగ పూర్‌, జపాన్‌ తదితర కంపెనీల వ్యాపారాలకు అప్పగించ డానికే బలవంతపు భూ సేకరణని, అందుకు ముఖ్యమంత్రి బెదిరించడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అది గోల్ఫ్‌ కోర్టులు, ధనవంతులకు విల్లాల నిర్మాణం కోసం సేకరించే భూమి మాత్రమేనని విమర్శించారు. అభివృద్ధి కోసం భూములు సేకరించకపోతే ఏలా అని మంత్రి యనమ ల రామకృష్ణుడు అంటున్నారని, ఇది ఎవరి అభివృద్ధి కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ చెల్లదన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమంటూ, కేంద్ర...

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు. ప్రచార గీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2 సమ్మె ఆవశ్యకతను కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సిఐటియు నిర్ణయించిందని, అందులో భాగంగానే ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ పాటలను రూపొందించామని చెప్పారు.

గుంటూరు, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధ్ది చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. రెండు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయించడంతో ఈ రెండు ఆసుపత్రులకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు రోజూ సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని మధు పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్ల కోసం 670 పడకలు మంజూరైనా, 412 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి మరో 80 పడకలు అవసరమవుతాయన్నారు. మొత్తం 750 పడకల రోగులకు వైద్య సేవలు సరిగా అందాలంటే అందుకు అవసరమైన...

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

Pages