District News

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. 47 మంది బాధితుల కుటుంబాలకు రూ....

నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు .. 

విజయవాడ:సింగపూర్‌ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్‌ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హొదా దాదాపు లేనట్లుగానే తేలిపోయిరది. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర అధికా రులకు కూడా కేంద్రం నురచి సంకేతాలు వచ్చాయి. సీనియర్‌ అధికారి ఒకరు కేంద్ర నిర్ణయాన్ని అనధికారంగా వెల్లడిరచారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యేక హౌదా తెరపైకి వస్తోరది. అధికార తెలుగుదేశం పార్టీ నురచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే అరశంపై గత నాలుగు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. నెల రోజుల్లో ప్రత్యేక హౌదా వస్తురదని, దీనికోసం పోరాటం కొనసాగి స్తామని, కేంద్రం కూడా ప్రత్యేక హౌదా ఇచ్చేరదుకు ఆలోచన చేస్తోరదని చెప్పుకురటూ వస్తున్నారు. అయితే ఇతర వర్గాల నురచి మాత్రం ఎరటువంటి స్పందన కనిపిరచడం లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ సంస్థ రూపొందించిన సీడ్‌ కాపిటల్‌ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్‌ కేపిటల్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్‌ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు...

 రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి సంతోష్‌ బగ్రోడియాకు పాస్‌పోర్టు ఇప్పించాలని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత లాబీయింగ్‌ చేసినట్లు సుష్మా ట్వీట్‌ చేశారు. పార్లమెంటులో ఆ...

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్‌ సెంటర్లో మంగళవారం మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కనీసం గంట సేపయినా రాష్ట్రానికి ప...

తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు. అరెస్టయి వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో ఉన్న ఆందోళనకారులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలతో పాటు పలు ట్రేడ్‌ యూనియన్ల రాష్ట్ర నేతలు కలిసి సంఘీభావం తెలిపార...

Pages