District News

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు. కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో అణచి...

నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున మైనార్టీల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. 

 

నెల్లూరు:సొంత జిల్లాలో మంత్రి నారాయణకు చుక్కెదురైంది. తెలుగు గంగ కాలువ నిర్మాణ పనుల పరిశీలకు వెళ్లిన నారాయణను నీటి బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. పక్కనే స్వర్ణముఖి నది ఉన్నా తాగు నీటి సమస్య తీరలేదని నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు అడ్డుతొలగేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో నారాయణ ఫోన్‌లో మాట్లాలో హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.

వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్‌, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్‌ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్‌ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్‌ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ 10 లక్...

గూడూరులో జరిగిన కామ్రేడ్ ఇందుకూరు జనార్ధన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మీటింగ్ హాలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ,స్థానిక సిపిఎం నాయకులు,పార్టీ అభిమానులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రైతు సమస్యలు, విద...

Pages