District News

మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి పురపాలక సంఘం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు ప్రభు త్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజల పై భారాలు చేసే యూజర్‌ ఛార్జీలను విరమించాలన్నారు. 279 ఇఒని రద్దు చేయాలని వారు డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి పార్టీలో చేరిక తేదీని ఖరారు చేస్తామన్నారు. తొలుత ఆనం సోదరులు గురువారం నెల్లూరులోని తమ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభిప్రాయ సేకరణ జరిపారు.

వరద బాధితులకు సిపిఎం అపన్నహస్తం అందించింది. నెల్లూరు నగరంలో బాధితులకు స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతృత్వంలో సాయం అందజేశారు. నాయకులు నడుముల్లోతు నీళ్లలోనే వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆహారపొట్లాలు, మంచీనీటి ప్యాకెట్లు, కొవ్వొత్తులు అందించారు.ఐదురోజులుగా నగరంలోని సుమారు 30 వేల ఇళ్లు నీటిలోనే ఉండడం పట్ల మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు సిపిఎం ముందుంటుందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే వరద సంభవించిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నెల్లూరు చెరువు గేటు ఎత్తేశారని అన్నారు. కాలువలు ఆక్రమణకు గురికావడం వల్లనే నీరు తియ్యలేదన్నారు....

నెల్లూరులో వరద గ్రామాలలో సిపిఎం సహాయకచర్యలు చేపట్టింది. గ్రామా గ్రామాన వరదల్లో చిక్కుకున్న వారికి సహాకారం అందించడంతో పాటు ఆహారపొట్లాలను అక్కడి సిపిఎం కార్యకర్తలు పంపిణి చేస్తున్నారు ..వరదలవలన నష్టపోయినవారిని ఆదుకోవడం కోసం చేయి చేయి కలపాలని కోరుతున్నారు.

Pages