District News

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య లక్ష దాటిపోరుంది. ఇందులో డెబ్భై అయిదు వేల మంది అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, కెనడా వంటి సంపన్న దేశాలలోనే మరణించడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఆయా దేశాల అనుభవాలలో పరిపరివిధాలుగా వుండొచ్చు గాని ఒక విషయంలో మాత్రం తేడా లేదు. ఇది ప్రపంచీకరణ వైఫల్యం. నయా ఉదారవాద విధాన సంక్షోభం. అందుకు అతి తీవ్రంగా గురైన వైద్య వ్యవస్థల వైఫల్యం. ప్రపంచ ప్రజల ఆరోగ్య, ఆర్థిక, ఆహార భద్రతలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిన విషాదం. అద్దాల మేడలా మెరిసిన అంతర్జాతీయ వ్యవస్థ భూత్‌ బంగళాగా మారిపోయింది. ఏ యుద్ధం లేకుండానే శత్రువు దాడి లేకుండానే శవాల గుట్టలు పడుతున్నాయి. కరోనా అదృశ్య శత్రువు అంటున్నారు గాని నిజానికి అగోచర శత్రువు. మనం...

సమాజం ఎప్పుడూ మారుతూ వుంటుంది. ప్రపంచంలో ఏ మార్పు అయినా ఆకాశం నుండి ఊడిపడదు. సమాజంలోనే అందుకు సంబంధించిన చోదకశక్తులు వుంటాయి. బుద్ధిజీవులు వాటిని అర్థం చేసుకొని మార్పును అంగీకరిస్తారు. మరికొందరు వాటికి మానవాతీత శక్తుల్ని అంటగట్టి ఆవేదన చెందుతారు. అనేక భయాందోళనల మధ్య, సవాలక్ష అనుమానాల మధ్య, అనేక అపనమ్మకాల మధ్య, అనంత వేదనలు, ఆవేదనల మధ్య వున్నాం మనం. లాక్‌డౌన్‌లో చాలారోజులు ఉండిపోతే వైరాగ్యం రావడం కద్దు. చాలా రకాల వైరాగ్యాలున్నాయి. ఎవరి చావుకైనా వెళ్లొచ్చినప్పుడు...ఈ పాడు జీవితం బుద్బుదప్రాయం. ఎప్పుడైనా వెళ్లిపోవాల్సిందే కదా.. చెయ్యకూడని పనులన్నీ చేశాం, ఏం కట్టుకుపోతాం...వంటి భావనలతో సతమతం కావడమే స్మశాన వైరాగ్యం. కడుపులో ఆకలి కేక పెట్టగానే ఈ...

అతి చిన్నదే, అయినా కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది. ఈ 21వ శతాబ్దంలో రెండు సామాజిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య గల తేడాను ప్రస్ఫుటంగా మరోసారి కనపరిచింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను కొన్ని దేశాలు ఎదుర్కొన్న తీరు ఈ తేడాను ప్రముఖంగా చూపిస్తోంది. ఒకవైపు-ప్రపంచం లోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికా వుంది. ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వుంది. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే ఆరోగ్య రంగం లాభాల దిశగా పయనిస్తోంది. కానీ, కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. పైగా ఆస్పత్రుల్లో పడకలు, ఐసియు లు, వెంటిలేటర్లు,...

అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే కరోనా వైరస్‌ నేడు విశ్వ మానవాళికి పెను సవాలు విసురుతూ అతి పెద్ద శత్రువుగా పరిణమించింది. అణ్వాయుధ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అణగారిన దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తూ హడలెత్తిస్తున్న ఈ మహమ్మారిపై చైనాలోని వుహాన్‌ నగరం విజయం సాధించింది. ఇది ఈ వైరస్‌పై మానవాళి సాగిస్తున్న పోరాటంలో దక్కిన తొలి విజయం. ప్రజలు, ప్రజా సంక్షేమం కోరే పాలకులు ఉమ్మడిగా పట్టుబడితే ఎంతటి భయంకరమైన శత్రువైనా పాదాక్రాంతం కాకతప్పదనేందుకు వుహాన్‌ తార్కాణంగా నిలుస్తోంది. కరోనా మొట్టమొదట వెలుగుచూసిన హ్యుబెయి ప్రావిన్స్‌ లోని వుహాన్‌లో 76 రోజుల లాక్‌డౌన్‌కు బుధవారం తెర దించడం అక్కడి ప్రజలకే గాక విశ్వజనులందరికీ అమితానాందం...

లాక్ డౌన్ నేపధ్యంలో విజయవాడ సింగ్ నగర్ 59, 60 వ డివిజన్ లలో సిపిఎం నాయకులు ఇంటింటికీ కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల కొరతతో పాటు, ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్ , పప్పు ధాన్యాలు రేట్లు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో విఫలమైందన్నారు. దీపం పథకం కింద ఉన్న వారికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పనుల్లేని కార్మికులకు esi నుండి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్మికులకు కేటాయించిన 1000 కోట్ల నిధులని...

లాక్‌డౌన్‌ కారణంగా కేరళ రాష్ట్రానికి ఏమేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మీ అంచనా!

మాకు సాధారణ పరిస్థితులలో ఉండే ఆదాయాలలో కన్నా 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా జిఎస్‌టి వలన వచ్చే ఆదాయం సహజం గానే రాదు. మేం లాటరీలు నిలిపివేశాం. కేరళలో మందు దుకాణాలు మూసివేశాం. మోటార్‌ వాహనాల అమ్మకాలు లేవు. భూ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసినా రాబోయే మూడు నెలలలో ఇదివరకటి ఆదాయంలో సగానికి సగం తగ్గుదల ఉంటుంది. మొదటిగా లాక్‌డౌన్‌ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే యథాస్థితి రాదు. మూసివేసిన చిన్న పరిశ్రమల పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. పర్యాటకం లాంటివి...

కరోనా వైరస్‌ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్‌ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్‌ లూ, కలవకుండా ఉండడాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహా విపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది....

కరోనా వైరస్‌ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్‌ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న అనేక మంది స్పెషలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం 58 ప్రైవేటు ఆసుపత్రులలో...

Pages