District News
విజయవాడలో వందలాదిగా ఉన్న బెంగాలీ వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాట తప్పింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారి రూముల్లోకి వెళ్ళి మరీ లాఠిఛార్జి చేసి అనేకమందిని గాయపర్చారు. పోలీసుల సమక్షంలో స్థానిక వైసిసి కార్యకర్తలు బెంగాలీ కార్మికులపై దాడిచేసి వలస కూలీలను గాయపర్చారు. వారి ఆందోళనకు మద్దతు తెపడానికి వెళ్ళిన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నగర నేతలు బోజెడ్ల నాగేశ్వరరావు, యు.వి.రామరాజు, సిఐటియు నేత మీరావళి లను పోలీసులు అరెస్టు చేసి తోట్ల వల్లూరు పోలిస్ స్టేషన్‌కి తరలించారు. సిపిఐ(యం) నేత బాబూరావు అరెస్టుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, వలస కూలీను...