District News

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ భూములను పి.మధు పరిశీలించి హక్కుదార్లతో...

భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు. ఎస్‌టి కాలనీలో ఒక్క ఇంటిలోనే రెండుమూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కాలనీ పక్కనే నిరుపయోగంగా ఉన్న...

శావల్యాపురం మండలంలోని కనమ ర్లపూడి, శావల్యాపురం, పోట్లూరు, ఇర్లపాడులో సిపిఎం పాదయాత్ర సాగింది. కనమర్లపూడి ఎస్‌సి కాలనీలో తాగునీరు, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలను, శావల్యాపురంలో ఇళ్ల పట్టాలు, స్థలాలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. శ్మశానా స్థలాల పక్క పొలాలవారు దారి మూసేశారని తెలిపారు. పోట్లూరు ఎస్‌సి కాలనీలో దగ్గర్లోని ఐదెకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను పేదలకివ్వాలని, గ్రామంలో 300 మంది అగ్రీగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇర్లపాడులో దళితులకు సంబంధించిన ఐదెకరాలను పెత్తందార్లు ఆక్రమించారని, ఎదిరించిన వారిపై కేసులు పెడుతున్నారని అక్కడివారు వాపో యారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు సైతం అర్హులకు ఇవ్వడం లేదని బృందానికి తెలిపారు...

పనులు లేకుండా ఇళ్లల్లోని మగాళ్లతో మద్యాన్ని తాగబోస్తున్నారని అన్నవరప్పాడు మహిళలు వాపోయారు. పిల్లలను పోషించేందుకు అంతులేని అగచాట్లు పడుతున్నామని, కాస్తో కూస్తో కూలి డబ్బులున్నా వాటిని మార్చుకోడానికి బ్యాంకుల వద్ద పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావని ఆవేదనను వెళ్లగక్కారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. అన్నవరప్పాడులోని మహిళలు సిపిఎం బృందానికి తమగోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్‌ 50 యూనిట్లయితే బిల్లు లేదని చెప్పినా తమ వద్ద వసూలు చేస్తున్నారని, పనుల్లేక మిర్చి తోడాలు తీయడానికి వెళ్తే ఊపిరి తిత్తుల సమస్యలు వేధిస్తున్నాయని, జ్వరమొచ్చినా మందుబిళ్ల కొనలేని దుస్థితి నెలకొందని కన్నీరు పెట్టుకన్నంత పని...

పేదల కోసమని పెదరావూరులో సేకరించిన భూమిని అర్హులకు పంపిణీ చేయకుంటే ఆ భూమిలో సిపిఎం జెండాలు పాతి పంచుతుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి చెప్పారు. 11 రోజులుగా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వైకుంఠపురం కాల్వకట్ట, నరేంద్రదేవ్‌కాలనీ, హడ్కోకాలనీ, చినరావూరు తోట, చినరావూరు డొంక తదితర ప్రాంతాల్లో సాగింది. 50 ఏళ్ల నుండి వైకుంఠపురం కాల్వకట్ట, చినరావూరు డొంక రోడ్డులలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, పట్టాల కోసం నాయకులను వేడుకుంటుంటూ పదేళ్ల నుండి ఊరుకుని గెలిచి రెండేళ్లే అయిన మమ్మల్ని అడిగితే ఎక్కడి నుండి తెస్తామని అంటున్నారని వాపోయారు. పాముల భయం, దోమల ఉధృతి, అంటు రోగాలతో నిత్యం సతమతమవుతున్నామని ఆవేదనకు గురయ్యారు. గృహ...

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు సిపిఎం పాదయాత్ర బృందం ఎదుట వాపోయారు. గురవారం మండలంలోని ఆయా గ్రామాలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈసందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు జి. బాలకృష్ణ మాట్లాడుతూ మండలం లోని ఆయా గ్రామాల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వాటర్‌ట్యాంక్‌లు నిర్మించినప్పటికీ పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంలేదని అన్నారు. రుద్రవరం, దమ్మాలపాడు, తొండపి, పలుదేవర్లపాడు గ్రామాల్లో వీధిలైట్లు లేక చీకటిలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలే లైట్లు వెలుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించు కోవడంలేదన్నారు.

:సమస్యల వలయంలో రేపల్లె పట్టణం కొట్టుమిట్టాడుతుందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రెండోరోజైన మంగళవారం నేతాజికాలనీలో ప్రారంభమై అనంతరం 2, 20 వార్డుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లంబాడీ కాలనీ, ఎస్టీకాలనీ వివిధ ప్రారతాల్లో పేదలు నివసిస్తున్న ఏరియాల్లో సమస్యలనడిగి తెలుసుకున్నామని చెప్పారు. మణిలాల్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఎస్టీకాలనీలో గతంలో 80 మందికి బీఫారం ఇచ్చారని అందరికి ఆధార్‌ కార్డులున్నా మరుగుదొడ్లు కట్టుకోవటానికి అవకాశం ఇవ్వటంలేదని చెప్పారు. మరుగుదొడ్లులేని ప్రజలు రైల్వే, మున్సిపల్‌ ఖాళీ ప్రదేశాల్లో మలవిసర్జన చేసినందుకు మున్సిపల్...

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు, గృహ నిర్మాణాలను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మాణం చేపట్టి పూర్తిచేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, యన్‌.కాళిదాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం పెదనందిపాడు చేరింది. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సాగునీరు, తాగునీరు లేక దశాబ్దాలుగా అల్లాడుతుంటే అధికారం సాధించిన ఆయా పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో కాలం గడవటమే గాని, సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వాలే లేవన్నారు. గుంటూరు ఛానల్‌ను గతంలో మాదిరిగానే దగ్గుబాడు హై లెవల్‌ ఛానల్‌గా గుర్తించి పొడిగిస్తేనే...

ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయని దీనికి ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిదర్శనమని సిపిఎం రాజధాని కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానికి భూమి సమీకరణ క్రమంలో వ్యవసాయ కూలీలందరికీ రూ.2500లు పెన్షన్‌ అందిస్తామంటూ పేర్కొన్నారని, కానీ అందరికీ ఆయా పెన్షన్లు అందడంలేదని చెప్పారు. కేజీ టు పిజి ఉచిత విద్యను అమలుచేస్తానని చెప్పిన పాలకులు ఎక్కడ అమలుచేశారంటూ ప్రశ్నించారు. కేవలం మాటల గారడీ తప్పా ఆచరణలో కార్యాచరణ మాత్రం లేదన్నారు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారంటూ...

సిపిఎం బాపట్ల డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర మంగళవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈ మని అప్పారావు ప్రారంభించారు. దళిత వాడలో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేదని, గ్రామంలో అంతర్గత రోడ్ల సౌకర్యం లేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. బేతపూడిలో లైబ్రరీ సెంటర్లో నివాసముంటున్న ప్రజలు గత కొన్నేళ్లుగా గ్రామకంఠానికిచెందిన భూమిలోనే ఇళ్ళు కట్టుకొని నివాసముంటున్నామని వాటికి ఇంతవరకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు. ఐఎవై పథకం కింద ఇళ్ళుకట్టించే సందర్భంలో సర్టిఫికెట్‌ ఇచ్చి తిరిగి తహశీల్ధార్‌ కార్యాలయంలోనే ఉంచుకున్నారని, గ్రామంలో రోడ్లు మంచినీటిసమస్య తీవ్రంగా ఉందని...

Pages