District News

రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్‌డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్‌డిఏ అధికారులు తేల్చిచెప్పారు. తమ గ్రామాల్లో భూములివ్వనప్పుడు మేము పొలాలు ఇవ్వబోమని, వెంటనే సాగుచేసుకుంటామని...

రాజధాని నిర్మాణానికి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. 'నా రాజధాని నా అమరావతి నా ఇటుక' కార్యక్రమంలో భాగంగా ఈ వసూళ్లు చేయాలంది. ఈనెల 10లోగా ఈ వసూళ్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రికి అందజేయాలని మోమోలో పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం...

పల్నాడులో నిర్వహించే ప్రజా పోరాటాలకు పిడుగురాళ్లలోని సిఐటియు కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పేర్కొన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన సిఐటియు కార్యాలయం (కన్నెగంటి హనుమంత్‌ భవనం)ను ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ శిలాఫలకాన్ని గఫూర్‌ ఆవిష్కరించగా ప్రధాన గదిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు ప్రారంభించారు. యూనియన్‌ పతాకాన్ని రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు సిఐటియు పల్నాడు ఏరియా కార్యదర్శి గోపాలరావు అధ్యక్షత వహించారు...

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. పూలింగులో ఉన్న శ్రద్ధ తమకు వాటా ఇచ్చే సమయంలో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. జనచైతన్య యాత్రలనూ బహిష్కరిస్తున్నారు.రాజధాని ప్రకటించిన తొలిరోజే భూములిచ్చామని, ఇంతవరకు ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్‌ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామి అన్నారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్‌ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్‌ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు. గతంలో టెర్రిస్టులు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు...

వామపక్షాల దేశ వ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్‌ 1 నుండి 6వ తేదీ వరకు మతోన్మాదంపై వ్యతిరేక దినాలుగా పాటించాలని వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. డిసెంబర్‌ 3న స్థానిక అంబేద్కర్‌సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో తూమాటి శివయ్య అధ్యక్షతన పలు వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతంపై మరింత మొగ్గు చూపుతుందని, దీనికి ప్రతిఘటన క్రమం ప్రారంభం కావటం సానుకూల పరిణామమన్నారు. రచయితలు, మేధావులు, కళాకారులు, ఇందులో గొప్ప పాత్ర పోషించటం అభినందనీయమన్నారు. బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్‌...

ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి లంక భూములను సేకరించడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.1 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.

రాజధాని పనులకు ఇంతవరకు ఒక్క టెండరూ ఖరారు చేయలేదు. కేవలం కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియ మినహా ఇతర టెండర్లను ఖారారు చేయలేదు. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధాన ప్రధాన రహదారికే ఇంతవరకు స్పష్టత లేదని అధికారులే వాపోతున్నారు. కన్సల్టెంట్లు కూడా రాజధాని కేంద్ర ప్రాంతం నుండి కొండవీటివాగు స్లూయిస్‌ వరకూ ప్లానింగ్‌ ఇచ్చారు. అక్కడి నుండి జాతీయ రహదారికి అనుసంధాన రహదారిని ఫైనల్‌ చేయలేదు. అధికారులు మాత్రం మణిపాల్‌ ఆస్పత్రి వెనుక భాగంలోనూ, వడ్డేశ్వరం సమీపంలోనూ భూ పటుత్వ పరీక్షల కోసం పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రోడ్డు ఎక్కడ వేయాలనేది స్పష్టం చేయలేదు. రోడ్లకు సర్వే చేసిన కంపెనీ ఇటీవల మూడు ప్రతిపాదనలు చేసింది. మణిపాల్‌...

 రాజధాని అభివృద్ధి పనులు చేపట్టడానికి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని రిజర్వు ఫారెస్టు ఏరియాని సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు కౌన్సిల్‌ ఆమోదించింది. తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వు ఫారెస్టు ఏరియాలో 1032 నివాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేయాలనీ కౌన్సిల్‌ తీర్మానించింది. అలాగే, ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్‌షాపు వైజంక్షన్‌ వద్ద రూ.14లక్షల 50 వేల వ్యయంతో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయడానికి రూపొందించిన అంచనాలను ఆమోదించారు.

Pages